ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Police overaction: సీఎం జగన్ టూర్.. పోలీసుల ఓవరాక్షన్

ABN, First Publish Date - 2023-07-04T09:42:57+05:30

జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నగరం మొత్తాన్ని పోలీసులు ట్రాఫిక్‌లో బంధించారు. ఎమ్మెస్సార్, దర్గా సర్కిల్, గాంధీ సర్కిల్, గిరింపేట సర్కిల్, కట్టమంచి అన్ని ప్రాంతాల్లో ఎక్కడకక్కడ ప్రజలను కదలనివ్వకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohanreddy) పర్యటన నేపథ్యంలో నగరం మొత్తాన్ని పోలీసులు (Chittoor Police) ట్రాఫిక్‌లో బంధించారు. ఎమ్మెస్సార్, దర్గా సర్కిల్, గాంధీ సర్కిల్, గిరింపేట సర్కిల్, కట్టమంచి అన్ని ప్రాంతాల్లో ఎక్కడకక్కడ ప్రజలను కదలనివ్వకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆంక్షల పేరుతో సామాన్య ప్రజలను, డిపార్ట్‌మెంటులో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు. ఐడెంటి కార్డులు ఉంటే తప్ప రోడ్లపై కూడా కదలడానికి వీలులేదని ఆంక్షలు పెడుతూ పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి. పోలీసుల తీరుతో సామాన్య ప్రజలు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా వీలు లేకుండా ప్రజలను పోలీసులు నిర్బంధిస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రజలు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. మూడేళ్ల తరువాత రెండోసారి చిత్తూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇటు అమూల్‌ డెయిరీ, అటు సీఎంసీ వద్ద 300 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి చిత్తూరు మెసానికల్‌ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. ఆ తరువాత రోడ్డు మార్గాన అటవీ ప్రాంతం నుంచి కారులో బయలుదేరి గంగినేని చెరువు మీదుగా వెళ్తారు. అక్కడి నుంచి రోడ్‌షోలో పాల్గొంటూ వేలూరురోడ్డు మీదుగా గిరింపేటకు చేరుకుంటారు. 10:30 గంటలకు విజయా డెయిరీ ప్రాంగణానికి చేరుకుని అమూల్‌ సంస్థ ప్రతినిధులతో కలిసి 20 నిమిషాలపాటు జరిగే భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10:55 కారులో బయలుదేరి ప్రశాంత్‌ నగర్‌లోని పోలీసు పరేడ్‌ మైదానానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి గుడిపాల మండలం చీలాపల్లె సీఎంసీకి చేరుకుంటారు. అక్కడ భూమిపూజ, 300 పడకల ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 1:30 హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి జగన్ తిరుగు ప్రయాణమవుతారు.

Updated Date - 2023-07-04T09:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising