ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh padayatra: లోకేష్‌‌ను వదలని ఏపీ పోలీసులు... పాదయాత్రలో కొత్తగా ఏం చేర్చారో తెలుసా..

ABN, First Publish Date - 2023-02-27T11:29:15+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పోలీసులు పలు రకాలుగా అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తూనే ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra)లో పోలీసులు (AP Police) పలు రకాలుగా అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తూనే ఉన్నారు. లోకేష్ మైక్ లాగేసుకోవడం, కుర్చీని లాక్కోవడం, ప్రజలను పాదయాత్రకు రానీయకుండా అడ్డుకోవడం ఇలా అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారు. తాజాగా లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)లో ఈరోజు నుంచి కొత్తగా పోలీసుల వీడియో కెమెరాలు (Video cameras) వచ్చి చేరాయి. పోలీసులు దగ్గర ఉండి మరీ వీడియో కెమెరా ద్వారా తాము చెప్పిన విజువల్స్‌ను తీయించుకుంటున్నారు. ఇప్పటి వరకు అక్కడక్కడ డ్రోన్ కెమెరాల (Drone Camera)ద్వారా పోలీసులు నిఘా పెట్టిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచి రెండు వీడియో కెమెరాలను పెట్టి ప్రత్యేకంగా కొన్ని విజువల్స్‌ను షూట్ చేయించుకుంటున్నారు. అయితే భద్రతాపరమైన అంశాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన వంటి వాటిపైన దృష్టి పెట్టకుండా రాజకీయ అంశాలపై పోలీసుల వీడియో చిత్రీకరణ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

శివగిరిలో విడిది కేంద్రం నుంచి పాదయాత్ర మొదలు...

మరోవైపు ఈరోజు ఉదయం చంద్రగిరి మండలం శానంబట్ల పంచాయతీ, శివగిరిలో విడిది కేంద్రం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)ను మొదలుపెట్టారు. లోకేష్ (Nara Lokesh) ఇప్పటి వరకు 380.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈరోజు ముందకు శానంబట్ల గ్రామంలో స్థానికులతో మాటామంతీ నిర్వహించారు. పిచ్చినాయుడుపల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశమయ్యారు. ఆపై తొండవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యువనేత ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తొండవాడలో భోజన విరామం తీసుకోనున్నారు. భోజనవిరామ అనంతరం అదే ప్రాంతంలో స్థానికనేతలతో యువనేత అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:00 గంటలకు తొండవాడ నుంచి పాదయాత్ర కొనసాగనుంది. 4:30 గంటలకు చంద్రగిరి టవర్ క్లాక్ జంక్షన్‌లో స్థానికులతో మాటామంతీ చేయనున్నారు. 5:05 గంటలకు చంద్రగిరి నూర్‌జంక్షన్‌లో స్థానికులతో లోకేష్ భేటీ అవనున్నారు. 6:55 గంటలకు ఇత్తెపల్లిలో స్థానికులతో మాటామంతీ నిర్వహించనున్నారు. రాత్రి 7:45 గంటలకు మామందూరు విడిది కేంద్రంలో లోకేస్ బస చేయనున్నారు.

Updated Date - 2023-02-27T11:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising