TDP Sugunamma: 10 వేలు తీసుకోవల్సిన అవసరం టీటీడీకి ఏమొచ్చింది?
ABN, First Publish Date - 2023-06-21T16:37:06+05:30
శ్రీవాణి ట్రస్టుపై అనేక అనుమానాలు ఉన్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీవాణి ట్రస్టుపై ప్రజలకే అనుమానం ఉంది. ట్రస్టుపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తారా..? టీటీడీ.. వై.వి.సుబ్బారెడ్డికి సొంత సంస్థ కాదు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఏమవుతున్నాయి..? ట్రస్టు నిధులతో ఎన్ని ఆలయాలు నిర్మించారు. ఛారిటబుల్ ట్రస్టు అంటేనే పూర్తి ఉచితం.. ఒక్కొక్క భక్తుని నుంచి
తిరుపతి: శ్రీవాణి ట్రస్టుపై అనేక అనుమానాలు ఉన్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (sugunamma) ఆరోపించారు. సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీవాణి ట్రస్టుపై ప్రజలకే అనుమానం ఉంది. ట్రస్టుపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తారా..? టీటీడీ.. వై.వి.సుబ్బారెడ్డికి సొంత సంస్థ కాదు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఏమవుతున్నాయి..? ట్రస్టు నిధులతో ఎన్ని ఆలయాలు నిర్మించారు. ఛారిటబుల్ ట్రస్టు అంటేనే పూర్తి ఉచితం.. ఒక్కొక్క భక్తుని నుంచి రూ.10 వేలు ఎందుకు వసూలు చేస్తున్నారు..?, టీటీడీ పాలకమండలి నియామకం నుంచే ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy), టీటీడీ ఈవో ధర్మారెడ్డిలు అనుభవం లేని వ్యక్తులు. సీనియర్ ఐఏఎస్ అధికారిని వెంటనే టీటీడీ ఈవోగా ప్రకటించాలి. తిరుమలలో అన్యమత ప్రచారం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలన (CM JAGAN) అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి నెలా శ్రీవాణి ట్రస్టుపై వచ్చే ఆదాయాన్ని బహిర్గతం చేయాలి. గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై నిప్పురవ్వలు పడ్డాయి.. దగ్గరగా నేనే చూశా.’’ అని సుగుణమ్మ వెల్లడించారు.
Updated Date - 2023-06-21T16:37:06+05:30 IST