Nara Lokesh: విశాఖ గ్లోబల్ సమ్మిట్‌పై లోకేష్ విసుర్లు
ABN, First Publish Date - 2023-03-06T11:10:55+05:30
విశాఖలో జరిగి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు.
అన్నమయ్య జిల్లా: విశాఖలో జరిగి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit held in Visakhapatnam)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) విరుచుకుపడ్డారు. సోమవారం పీలేరులో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదు.. లోకల్ ఫేక్ సమ్మిట్ అని అన్నారు. ఏబీసీ కంపెనీ టర్నోవర్ రూ.120 కోట్లు అని.. అలా కంపెనీ లక్షా 20 వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని ప్రశ్నించారు. రూ.లక్ష కేపిటల్ ఉన్న ఓ కంపెనీ రూ.76వేల కోట్లు పెట్టుబడి పెడుతుందా అంటూ నిలదీశారు. పీపీఏలు రద్దు చేయొద్దని కేంద్రం హెచ్చరించినా జగన్ (AP CM Jagan Reddy) పట్టించుకోలేదని యువనేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకేష్ ఇంకా మాట్లాడుతూ... ఏపీలో ఉద్యోగాలు నిల్.. గంజాయి ఫుల్ అని అన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలం ఏపీలోనే ఉందని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలు జగన్ పాలనలో బైబై చెప్పాయన్నారు. ఏపీలో ఉన్న కంపెనీలు విస్తరణ చేపట్టడం లేదని.. అమర్‌రాజాతో పాటు ప్రముఖ కంపెనీలు వెళ్లిపోయాయని అన్నారు. రాష్ట్రంలో యువత 20 వేల ఉద్యోగాలు కోల్పోయిందని లోకేష్ (TDP Leader)పేర్కొన్నారు.
మరోవైపు లోకేష్ ఈరోజు పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. 36వ రోజు పీలేరు శివారు వేపులబయలు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర మొదలైంది. ముందుగా బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి నిర్వహించారు. ఆపై అంకాళమ్మతల్లి దేవాలయం వద్ద ఉప్పర, సగర సామాజిక వర్గీయులతో మాటామంతీ చేయనున్నారు. మధ్యాహ్నం శివాపురం గ్రామంలో స్థానికులతో భేటీకానున్నారు. తిమ్మిరెడ్డిగారిపల్లిలో భోజన విరామం అనంతరం పాదయాత్ర (Lokesh YuvaGalam) కొనసాగనుంది. సాయంత్రం కొర్లకుంట పట్టికాడ గ్రామంలో స్థానికులతో లోకేష్ మాటామంతీ నిర్వహించనున్నారు. కలికిరి పంచాయితీ సత్యపురం వద్ద స్థానికులతో భేటీ అవనున్నారు. తర్వాత కలికిరిలో రైతులతో యువనేత భేటీ అవుతారు. సాయంత్ర 5:30 గంటలకు కలికిరి పంచాయితీ నగిరిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. కలికిరి ఇందిరమ్మ కాలనీ వద్ద పార్టీలో చేరికలు జరుగనున్నాయి. సాయంత్ర 6:30 గంటలకు కలికిరి ఇందిరమ్మ కాలనీ వద్ద విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.
Updated Date - 2023-03-06T11:48:55+05:30 IST