ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NaraLokesh: మహిళలకు లోకేష్ పాదాభివందనం

ABN, First Publish Date - 2023-03-08T11:40:01+05:30

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిత్తూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Internationa Womens Day) సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Naralokesh) శుభాకాంక్షలు తెలిపారు. పీలేరు నియోజకవర్గంలో పాదాయత్ర చేస్తున్న ఆయన బుధవారం ఉదయం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు పాదాభివందనం చేశారు. లోకేష్ (YuvaGalam) మాట్లాడుతూ... ‘‘అమ్మలేనిది జన్మ లేదు. భూమికన్నా ఎక్కువ భారం మహిళలపై ఉంది. అలాంటి మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది’’ అంటూ సమావేశానికి వచ్చిన మహిళలకు లోకేష్ (YuvaGalam Padayatra) పాదాభివందనం చేశారు. మహిళలకు లోకేష్ (Nara lokesh) ఇచ్చిన గౌరవం పట్ల నారీమణులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా... లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) ఈరోజు 38వ రోజుకు చేరింది. పీలేరు నియోజవర్గంలోని చింతపర్తి విడిది కేంద్రం నుంచి నేటి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర (Padayatra) ను ప్రారంభించడానికి ముందు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన మహిళలకు పాదాభివందనం చేసి.. వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో మహిళలకు సీఎం జగన్ (CM Jagan Reddy) ఇచ్చిన హామీలను విస్మరించారని యువనేత మండిపడ్డారు.

మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించి.. అదే మద్యపానంపై డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని విషయాల్లో మహిళలను టీడీపీ గౌరవించిందని గుర్తుచేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలను చిన్న చూపు చూసిందన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఈ సందర్భంగా లోకేష్ (Lokesh) ఆవేదన చెందారు.

********************************************************************

ఇది కూడా చదవండి

Pawan Wishes: ‘ఇంతటి మహోన్నతమైన స్త్రీకి ఏమిస్తే రుణం తీరుతుంది’


Updated Date - 2023-03-08T12:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising