ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP MLC: శ్రీవారి ఆశీస్సులతో యువగళం దిగ్విజయంగా సాగుతోంది

ABN, First Publish Date - 2023-08-31T10:45:51+05:30

టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల: టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ (TDP MLC Srikanth) గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ యువనేత నారా లోకేశ్‌ (TDP Leader Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 200వ రోజుకు చేరుకుందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో యువగళం పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల సమస్యలపై యువగళం పేరుతో నారా లోకేశ్‌ పోరాడారని తెలిపారు. నాలుగు వందల రోజుల్లో నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేసి ప్రజల సమస్యలు తీర్చే విధంగా పాదయాత్ర సాగాలని ప్రార్ధించానన్నారు. పుంగనూరులో నారా చంద్రబాబు పర్యటనలో కావాలనే వైసీపీ వాళ్ళు అల్లర్లు సృష్టించారని మండిపడ్డారు. టీడీపీ నాయకులని అక్రమ అరెస్టులు చేసి‌ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. లీగల్‌గా వెళ్ళి బెయిల్స్ తీసుకుంటున్నామన్నారు. వైసీపీ ఏజెంట్లు లాగా పోలీసులు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు టీడీపీ భయపడే పరిస్థితి లేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-31T10:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising