ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Nominations: ఎమ్మెల్సీ నామినేషన్లలో టెన్షన్ టెన్షన్

ABN, First Publish Date - 2023-02-23T19:39:51+05:30

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల (MLC Nominations)లో టెన్షన్ మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల (MLC Nominations)లో టెన్షన్ మొదలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ధనుంజయ్ యాదవ్ (Dhanunjay Yadav) నామినేషన్ (Nominations) వేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనను వైసీపీ (YCP) నేతలు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ధనుంజయ్ ఆరోపించారు. తాను ఏ పార్టీ తరపున నామినేషన్ వేయలేదని ధనుంజయ్‌ యాదవ్ చెప్పారు. పంచాయతీరాజ్ ఛాంబర్ నుంచి నామినేషన్ వేశానని ధనుంజయ్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని ధనుంజయ్ ఆరోపించారు. అందుకు నిరసనగానే చిత్తూరు జిల్లా నుంచి నామినేషన్ వేస్తున్నానని ఆయన వెల్లడించారు. కిడ్నాప్ ముప్పు ఉందని తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చానని, పోలీసులు తనకు భద్రత చర్యలు చేపట్టారని ధనుంజయ్ యాదవ్ తెలిపారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ (Central Election Commission Schedule) విడుదల చేసింది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ పేర్కొంది. నామినేషన్ల స్వీకరణకు చివరి గడవు తేదీని ఫిబ్రవరి 23గా, ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలిస్తామని ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 27న నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మార్చి 13వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, మార్చి 16న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడిన విద్యార్థి.. వివరాల్లోకెళ్తే..

*********************************

Lokesh YuvaGalam : మీసం మెలేసి చెబుతున్నా.. ఒక్కొక్కడికీ ప‌గిలిపోద్ది.. నారా లోకేష్ ఛాలెంజ్

**********************************

Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో

Updated Date - 2023-02-23T19:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising