Tirumala : బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..
ABN, First Publish Date - 2023-10-16T07:49:14+05:30
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (సోమవారం) బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ బీభత్సంగా ఉంటుందనుకుంటే.. చాలా తక్కువగా ఉంది.
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (సోమవారం) బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ బీభత్సంగా ఉంటుందనుకుంటే.. చాలా తక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం చాలా త్వరగానే అయిపోతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.72 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి.
Updated Date - 2023-10-16T07:49:14+05:30 IST