Tirumala : వీకెండ్ రానే వచ్చేసింది.. తిరుమలలో పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-11-04T07:39:16+05:30
తిరుమలలో భక్తుల రద్దీ చాలా తగ్గింది. గతంలో అయితే శనివారం వీకెండ్ కాబట్టి జనం తిరుమలకు పోటెత్తేవారు. కానీ గత కొన్ని వారాలుగా మాత్రం శనివారం తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం ఉండటం లేదు. ఇక నేడు భక్తులు చాలా తక్కువగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి నేరుగానే భక్తులను అనుమతిస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,048 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ చాలా తగ్గింది. గతంలో అయితే శనివారం వీకెండ్ కాబట్టి జనం తిరుమలకు పోటెత్తేవారు. కానీ గత కొన్ని వారాలుగా మాత్రం శనివారం తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం ఉండటం లేదు. ఇక నేడు భక్తులు చాలా తక్కువగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి నేరుగానే భక్తులను అనుమతిస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,048 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
Updated Date - 2023-11-04T07:39:18+05:30 IST