KA Paul: సీఎం కేసీఆర్‌వి అన్నీ దొంగ మాటలే: కేఏ పాల్
ABN, First Publish Date - 2023-04-22T21:13:13+05:30
సీఎం కేసీఆర్ (CM KCR) వి అన్నీ దొంగ మాటలే. సింగరేణిని నష్టాల నుంచి గట్టెక్కించలేనివారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ (Visakha Steel Plant)ను కాపాడతారట...
నర్సీపట్నం: ‘సీఎం కేసీఆర్ (CM KCR) వి అన్నీ దొంగ మాటలే. సింగరేణిని నష్టాల నుంచి గట్టెక్కించలేనివారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ (Visakha Steel Plant)ను కాపాడతారట’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఎద్దేవా చేశారు. దళిత బంధు పథకం అమలు చేయలేకపోయారని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంటును తాను కొని చూపిస్తానని, అయితే సదరు ప్లాంట్ కమిటీ సభ్యులను లెటర్ అడిగితే రెండేళ్ల నుంచి ఇవ్వడం లేదని పాల్ తెలిపారు. స్టీల్ ప్లాంటు పరిరక్షణ కోసం వైసీపీ, టీడీపీ (YCP TDP), వామపక్ష పార్టీల నాయకులను కలుసుకోవాలని తానే వారి వద్దకు వెళుతున్నానని వివరించారు. తాను చిట్టివలసలో పుట్టి, నర్సీపట్నంలో ఇంటర్, అనకాపల్లిలో డిగ్రీ చదువుకున్నానని చెప్పారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దగ్గర డబ్బు లేదని, స్టీల్‌ప్లాంట్ కొనడానికి ప్రజలను రూ.100 చొప్పున ఇమ్మంటే ఎవరిస్తారని ప్రశ్నించారు. తాను ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే అమరావతిలో రాజధాని భవనాలను ఏడాదిలో పూర్తిచేస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు.
Updated Date - 2023-04-22T21:13:18+05:30 IST