ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhogapuram airport: సీఎం సభ ఒకచోట.. ట్రాఫిక్‌ ఆంక్షలు మరోచోట

ABN, First Publish Date - 2023-05-03T20:21:01+05:30

సీఎం జగన్‌ (CM Jagan) పర్యటన విజయనగరం జిల్లాలో.. అయితే శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) మీదుగా ప్రయాణించే వారికి పెద్దకష్టం వచ్చిపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస: సీఎం జగన్‌ (CM Jagan) పర్యటన విజయనగరం జిల్లాలో.. అయితే శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) మీదుగా ప్రయాణించే వారికి పెద్దకష్టం వచ్చిపడింది. ఎందుకంటారా? అక్కడ సీఎం పర్యటన ఉందని పోలీసులు ఇక్కడ వాహనాలు నిలిపివేశారు. సీఎం రోడ్డు మార్గాన కూడా రాలేదు. హెలీకాప్టర్‌లో భోగాపురం (Bhogapuram) వద్ద దిగారు. అయినా పోలీసులు భోగాపురానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాలను నిలిపివేశారు.

ట్రాఫిక్‌ మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో సోంపేట, ఇచ్ఛాపురం (Sompet Ichchapuram) ప్రాంతాల్లో కూడా వాహనాలు నిలిపేశారు. నాలుగు గంటల పాటు లారీల డ్రైవర్లు, సిబ్బంది నీరు, ఆహారం కోసం ఇబ్బందులు పడ్డారు. కొంతమంది డ్రైవర్లు మీడియాతో మాట్లాడుతూ 150 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉందని, మధ్యలోనే తాము సరకులు దించాల్సి ఉన్నా పోలీసులు నిలిపివేశారని అన్నారు. వాహనాలు ఆలస్యంగా వెళ్తే లారీలో సరుకులు పాడవుతాయని, ముఖ్యంగా పచ్చి వస్తువులు దెబ్బ తింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సీఎం సభ పూర్తి కాగానే పోలీసులు వాహనాలను విడిచిపెట్టారు.

Updated Date - 2023-05-03T20:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising