ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Quota MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ABN, First Publish Date - 2023-03-23T17:18:58+05:30

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్ నం.1లో ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఈసీ పాస్లు ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్ నం.1లో ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఈసీ పాస్లు ఇచ్చింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) తరపున కౌంటింగ్ ఏజెంట్గా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నిలబడ్డారు. పయ్యావులతో పాటు పోలింగ్ ఏజెంట్గా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) 100 శాతం పోలింగ్ నమోదయింది. సీఎం జగన్ (CM Jagan), మాజీసీఎం చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి అధికారికంగా ఉన్న బలం 23 మంది, వైసీపీ బలం 151, జనసేనకు ఒక ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 175 ఓట్లు పోలయ్యాయి. అధికార వైసీసీ నుంచి ఏడు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రదానం ప్రతిపక్షమైన టీడీపీ అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధను పోటీలో నిలిపింది. ఈరోజు ఉదయం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తరువాత ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) నారాయణస్వామి (Narayana swamy), రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath), ఉషశ్రీ చరణ్ (Usha sri Charan), దాడిశెట్టి రాజా (Dadisetti Raja), ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు (Namburi Shankar Rao), మేకతోటి సుచరిత (Mekatoti Sucharita) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasadrao), మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి (Pamula Pushpa Srivani), ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (Jakkampudi Raja), కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathi) తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

టీడీపీ ఒక స్థానానికి మాత్రమే పోటీచేస్తోంది. సాంకేతికంగా ఆ పార్టీకి 23 స్థానాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్‌ (విశాఖ దక్షిణం) వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీకి 19 సీట్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని, ఈ ఏడు సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంటామని వైసీపీ నాయకత్వం మొదట భావించింది. కానీ ప్రతిపక్షం అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధను పోటీలో నిలిపింది. వైసీపీ నుంచి మరొక్క ఎమ్మెల్యే ఓటు వేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ నిలబెట్టిన ఏడుగురు అభ్యర్థుల్లో ఎవరో ఒకరు ఓడిపోతారు. వైసీపీకి బలం లేకపోయినా ఏడో అభ్యర్ధిని పోటీ పెట్టడంపై పార్టీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తితో ఎమ్మెల్యేలు డీవియేట్ అయ్యారా? అనే ఆందోళనలో వైసీపీ నేతలున్నారు.

Updated Date - 2023-03-23T17:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising