Ramakrishna: ఉపాధ్యాయులంటే జగన్ సర్కార్‌కు వణుకెందుకు?
ABN, First Publish Date - 2023-11-25T11:46:00+05:30
ముఖ్యమంత్రి జగన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయులంటే జగన్ సర్కార్‌కు వణుకెందుకు అని ప్రశ్నించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై (CM Jagan) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయులంటే జగన్ సర్కార్‌కు (Jagan Government) వణుకెందుకు అని ప్రశ్నించారు. ఏపీలో ఉపాధ్యాయులకు ఛార్జ్ మెమోలు జారీ చేయటం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధులకు వెళ్లకుండా చేసే కుట్రకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెరతీసిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధుల కోసం ఉపాధ్యాయుల వివరాలు అడిగినందుకే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. చార్జ్ మెమోల పేరుతో ఉపాధ్యాయుల మెడపై పెట్టిన కత్తి, రాబోయే ఎన్నికల్లో జగన్ సర్కారుకే గుచ్చుకోవడం ఖాయమని రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-11-25T11:46:02+05:30 IST