ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramakrishna: సీఎం జగన్, మంత్రులు, శాసనసభ్యులపై రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-08T18:04:22+05:30

సీపీఐ బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) మాట్లాడుతూ సీఎం జగన్‌పై (CM JAGAN) విమర్శలు గుప్పించారు.

తిరుపతి: సీపీఐ బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) మాట్లాడుతూ సీఎం జగన్‌పై (CM JAGAN) విమర్శలు గుప్పించారు.


"విశాఖ నుంచి తిరుపతి వరకు బస్సు యాత్ర నిర్వహించాం. 2019 ఎన్నికల్లో కరెంటు ఛార్జీలు పెంచనని.. జగన్ ఏడు సార్లు పెంచాడు. ఎక్కడా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి వెళ్లిపోతున్నాయి. నాలుగు సంవత్సరాల పాలనలో జగన్ ఒక పరిశ్రమ తీసుకురాలేదు. రాష్ట్రమంతా రహదారులు గుంతలుతో నిండాయి. రోడ్ల గుంతల్లో మంత్రులను, శాసనసభ్యులను పూడ్చాలి. ఇసుక పాలసీ మారుస్తానని దొంగ బిల్లులు వేసి దోచుకొంటున్నారు. చెత్తపన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా రికార్డు సాధించాడు. 26 జిల్లాల్లో మద్యం అమ్మకాల్లో ప్రతిసీసాపైనా రూ.వంద తాడేపల్లి పాలెస్ కు చేరుతోంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసి అప్పులపాలు చేశాడు. రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారు. పుంగనూరు చంద్రబాబునాయుడులో పర్యటించకూడదా?. చంద్రబాబు మీటింగ్ లకు వచ్చిన వారిపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. పుంగనూరు నీ అబ్బ జాగీరా. జగన్ అధికారం ఉందని అహంకారం వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం నాశనం చేస్తున్నారు. జగన్ మోడీ కాళ్లు మొక్కుతున్నారు. రాష్ట్రం రివర్స్ గేర్ లో నడుస్తోంది. మూడు రాజధానులు అంటూ జగన్ నాటకం ఆడుతున్నాడు. దేశాన్ని అప్పుల పాలు చేయడం, దేశo దివాళా తప్ప మోడీ చేసింది లేదు. రాష్ట్రాన్ని రక్షించండి. దేశాన్ని కాపాడండి అనేదే మన నినాదం కావాలి." రామకృష్ణ అన్నారు.

Updated Date - 2023-09-08T18:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising