ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: విగ్రహాల తొలగింపు రగడ... దేవినేని ఉమా హౌస్‌అరెస్ట్

ABN, First Publish Date - 2023-08-17T10:03:55+05:30

నందిగామలో అర్ధరాత్రి మహాత్మాగాంధీజీ, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రనహాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

ఎన్టీఆర్‌ జిల్లా: నందిగామలో అర్ధరాత్రి మహాత్మాగాంధీజీ (Mahatma Gandhi), స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) విగ్రహాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ రెండు విగ్రహాలను తొలగించిన అధికారులు వైఎస్సార్ విగ్రహం జోలికి వెళ్లకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు (గురువారం) ఉదయం టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా (TDP Leader Devineni Uma) నందిగామకు బయలుదేరిగా.. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ హౌస్ అరెస్టు చేశారు. దీనిపై దేవినేని మాట్లాడుతూ... వైసీపీ నాయకుల చెప్పు చేతల్లో కొంతమంది అధికారులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ నాయకుల ‌విగ్రహాలు తొలగించారన్నారు. అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహం ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. అడిగితే తమ టీడీపీ వాళ్లను అడ్డుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు వైఎస్సార్ విగ్రహం అడ్డు కాదా అని నిలదీశారు. ఇదేమీ న్యాయం... అధికారులూ ఆలోచించండి అంటూ దేవినేని ఉమా వ్యాఖ్యలు చేశారు.


కాగా.. గత రాత్రి ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అర్ధరాత్రి విగ్రహాల తొలగింపు విషయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నందిగామ గాంధీ సెంటర్లలో రోడ్లు విస్తరణలో భాగంగా మున్సిపల్ అధికారులు విగ్రహాల తొలగింపునకు యత్నించారు. ఇందుకోసం పోలీసులు భారీగా చేరుకున్నారు. విగ్రహాల తొలగింపును వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పలువురు టీడీపీ నేతలు గాంధీసెంటర్‌కు బయలుదేరారు. వెంటనే టీడీపీ నేతలు, సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. మునిసిపల్ అధికారులను కలసి మెమొరాండం ఇస్తామని చెప్పినప్పటికీ పోలీసులు వెళ్లనివ్వని పరిస్థితి.

Updated Date - 2023-08-17T10:03:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising