Devineni Uma: ఏపీ సీఎం జగన్‌పై దేవినేని ఉమ సంచలన ఆరోపణలు
ABN, First Publish Date - 2023-07-04T22:29:26+05:30
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswararao) విమర్శలు గుప్పించారు.
ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswararao) విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి డిల్లీ వెళ్లి తన కేసుల గురించి, బాబాయ్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏ9, ఏ10 పేర్లు వస్తాయనే, రాకుండా అడ్డుకోవాలని ఢిల్లీ పర్యటనకు వెళ్లారన్నాని విమర్శించారు.
రాష్ట్ర సమస్యలపై కానీ, రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై ఒక్కసారి అడిగింది లేదని, ప్రధానిని కలిసిన తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టిందని లేదని దేవినేని ఉమ మండిపడ్డారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రిని కలిసి అడుగుతూ ఉంటానని చెప్పాడని, ఎన్నికల ముందు మెడలు వంచుతానని చెప్పారని, ఓడ్డు దాటే దాకా బోడు మల్లన్న అన్నట్లు జగన్ రెడ్డి పరిస్థితి ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
లీటరుకు రూ. 4 తానే తెరిపిస్తానని తన పాదయాత్రలో చెప్పావా లేదా ప్రశ్నించారు. నేడు అమూల్‌కు ఎందుకు కట్టబెట్టారని, రూ. 600 కోట్ల డైరీ ఆస్తులను తాకట్టు పెట్టి, సహకార సంఘాలను నాశనం చేసి చంద్రబాబు, హెరిటేజ్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శివశక్తి డైరీనీ మంత్రిది, అది రాష్ట్రంలోనే రైతులకు తక్కువ ధర ఇస్తుందని, దాని గురించి మాట్లాడితే తమరు ముఖ్యమంత్రి పదవిలో ఉండలేరని దేవినేని ఉమ ఆరోపించారు.
తన కేసుల కోసం గుజరాత్ కి చెందిన అమూల్ సంస్థకు రాష్ట్రంలోని పాడి రైతులను కట్టబెట్టారని, పక్క రాష్ట్రం తమిళనాడులో నో అమూల్ కి చెప్పారని, వెయ్యి ఆర్టీసీ బస్సులు పెట్టి డ్వాక్రా మహిళలను బెదిరించి సభ పెట్టీ, ఎవరికీ బస్సులు లేకుండా చేశారని మండిపడ్డారు. కృష్ణా నది నుంచి నెలకు రూ. 22 కోట్లు, నెల్లూరు నుంచి రూ. 25 కోట్లు వెళుతున్నాయని, 10 రోజులకు ఒకసారి సూట్ కేసులు వెళ్తున్నాయని దేవినేని ఆరోపించారు.
చెరువులు, గుట్టలు, కొండలు తవ్వుకుంటూ ఎమ్మెల్యేలు తాడేపల్లి కొంపలో సజ్జల రామకృష్ణారెడ్డికి నెల నెలా లెక్కలు అప్పజెబుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.
Updated Date - 2023-07-04T22:32:18+05:30 IST