Chandrababu: రేపు కొనసీమ జిల్లాలో పర్యటన
ABN, First Publish Date - 2023-08-15T23:46:22+05:30
విశాఖ నగరంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) పర్యటన ముగిసింది.
రాజమండ్రి(Rajahmundry): విశాఖ నగరంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) పర్యటన ముగిసింది. విశాఖ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి బయలుదేరారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా వీడ్కోలు పలికారు. విశాఖపట్నం(Visakhapatnam)లో చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో తెలుగుదేశం శ్రేణులు ఆనందంలో ఉన్నారు. కాగా కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టు(Rajahmundry Airport)కి చేరుకున్నారు.రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తొర్రేడులో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు. రేపు అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District)లోని మండపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఆ జిల్లానేతలు రేపటి చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన
మండపేటలోని బాబు కన్వెన్షన్ హాలులో చంద్రబాబు నేడు (మంగళవారం) రాత్రి బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తొర్రేడులోని జీఎస్ఎన్ కన్వెన్సన్ సెంటర్ నుంచి బయలు దేరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. మండపేట మండలం ఏడిద గ్రామంలో రేపు మధ్యాహ్నం 3.30 నుంచి రచ్చబండ కార్యక్రమంలో రైతులతో చంద్రబాబు మాట్లాడుతారు. 5.20 గంటల నుంచి మండపేటలోని రాజారత్నం సెంటర్ నుంచి కలువపువ్వు సెంటర్ వరకు రోడ్డు షోలో పాల్గొంటారు. ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కలువపువ్వు సెంటర్‌లో చంద్రబాబు బహిరంగ సభలో ప్రసగింస్తారు. రాబోయే ఎన్నికలపై పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తారు.
Updated Date - 2023-08-15T23:55:52+05:30 IST