ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RIP Viswanath: ఆ జిల్లాను ప్రకృతి ప్రసాదించిన స్టూడియో అన్న విశ్వనాథ్

ABN, First Publish Date - 2023-02-03T10:33:49+05:30

కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పుగోదావరి: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (Kalatapaswi K Viswanath)కు జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. విశ్వనాథ్‌ (RIP Viswanath)కు ఎంతో గొప్ప ఘనకీర్తిని తెచ్చి పెట్టిన ‘‘శంకరాభరణం’’ (Shakarabharanam Movie) సినిమా రాజమండ్రి (Rajahmundry)లోనే చిత్రీకరించడం జరిగింది. అలాగే సిరిసిరిమువ్వ, స్వాతిముత్యం, సూత్రధారులు, ఆపద్భాందవుడు తదితర చిత్రాలను కూడా జిల్లాలోనే షూటింగ్ చేశారు. రాజమండ్రికి చెందిన అనేక మంది కళాకారులు, రచయితలతో విశ్వనాథ్‌ను అమితమైన అనుబంధం ఉంది. తూర్పుగోదావరి జిల్లా (East Godavari District)ను ప్రకృతి ప్రసాదించిన స్టూడియోగా అభివర్ణించిడం కె.విశ్వనాథ్‌కే చెందుతుంది.

కాగా... కొంతకొలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళాతపస్వి కె.విశ్వనాథ్ గత రాత్రి అపోలో ఆస్పత్రిలో కన్నుముశారు. ఆయన మృతితో తెలుగు చిత్రసీమలో విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు విశ్వనాథ్‌కు సంతాపం ప్రకటించారు. కళాతపస్వితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు. విశ్వనాథ్ మరణం తెలుగు పరిశ్రమకు తీరని లోటన్నారు. చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram) ,వెంకటేష్ (Venkatesh),రాఘవేంద్రరావు (Raghavendra Rao), బ్రహ్మాజీ (Brahmaji), కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao), సాయికుమార్ (Saikumar), మురళీమోహన్ (Muralimohan), శివాజీరాజా (Sivajeeraja), డబ్బింగ్ జానకి (Dubbing Janaki), పరుచూరి గోపాలకృష్ణ ( Paruchuri Gopalakrishna), సి కళ్యాణ్ (C Kalyan), ఉత్తేజ్ (Utheg), జీవిత రాజశేఖర్ (Jeetha Rajasekhar), మణిశర్మ (Manisharma), చంద్రబోస్ ( Chandra Bose), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు విశ్వనాథ్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

విశ్వనాథ్ మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister TalasaniSrinivasYadav) ఫిల్మ్‌నగర్‌లోని నివాసానికి వెళ్ళి విశ్వనాథ్ పార్ధివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2023-02-03T10:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising