Ashokgajapathiraju: అభియోగాలపై ఆనాడు ఎన్టీఆర్‌ను జైల్లో పెట్టలేదు.. కానీ ఇప్పుడు..
ABN, First Publish Date - 2023-10-13T11:11:51+05:30
అప్పట్లో ఎన్టీఆర్‌పై అభియోగాలు వచ్చినా లెజిస్లేటివ్ కమిటీ మూడేళ్ల పాటు విచారణ జరిపించిందని.. అభియోగాలపై ఎన్టీఆర్‌ను అప్పట్లో జైలులో పెట్టలేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
రాజమండ్రి: అప్పట్లో ఎన్టీఆర్‌పై (NTR) అభియోగాలు వచ్చినా లెజిస్లేటివ్ కమిటీ మూడేళ్ల పాటు విచారణ జరిపించిందని.. అభియోగాలపై ఎన్టీఆర్‌ను అప్పట్లో జైలులో పెట్టలేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు (Former Union Minister Ashok Gajapathiraju) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చేసే పనులను బట్టి జగన్‌కు (CM Jagan) సైకో బిరుదు వచ్చిందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రమంతా గంజాయి వ్యాపించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యం కాపాడాలని కోరారు. 16 నెలలు జైలులో ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యారని.. ఆఖరి దశలో ఉన్నారు కాబట్టి అమానుష సంఘటనలు ప్రభుత్వం మానుకోవాలని హితవుపలికారు. ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టడం ఏంటి... మంత్రులు చొక్కాలు ఇప్పడం ఏంటి అంటూ అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-13T11:11:51+05:30 IST