CBN Health Bulletin : చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యాధికారులు ఏం చెప్పారంటే..?
ABN, First Publish Date - 2023-10-13T22:03:26+05:30
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కు ఈరోజు జైలు వైద్యాదికారులు వైద్య పరీక్షలు(Medical tests) నిర్వహించారు.
రాజమండ్రి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కు ఈరోజు జైలు వైద్యాదికారులు వైద్య పరీక్షలు(Medical tests) నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం హెల్త్ బులిటెన్(Health Bulletin)ను జైలు శాఖ ఇన్‌చార్జి పర్యవేక్షణాదికారి రాజ్ కుమార్(Raj Kumar) విడుదల చేశారు. 12వ తేదీన విడుదల చేసిన ఏడు అంశాలపైనే ఈరోజు కూడా పరీక్షలు నిర్వహించి జైలు అధికారులు నివేదిక వెల్లడించారు. ఈ హెల్త్ రిపోర్టులో చంద్రబాబు బరువును జైలు అధికారులు ప్రకటించారు. చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారంటూ కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు కేజీ బరువు పెరిగారని జైలు శాఖ డీఐజీ రవి కిరణ్ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈరోజు హెల్త్ బులిటెన్‌లో కూడా చంద్రబాబు బరువు ప్రకటించకపోవడంపై చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-10-13T22:36:38+05:30 IST