ఉరిమే ఉత్సాహంతో..
ABN , First Publish Date - 2023-06-14T01:59:28+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 9 గంటలకు అన్నవరం సత్యదేవుడి దర్శనంతో జిల్లా లో యాత్ర మొదలుకానుంది. ప్రజాసమస్యలపై పోరాటం,అధికార వైసీపీ అవినీతి, అక్రమాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా సాగనున్న యాత్ర జిల్లాలో నాలుగు నియోజకవర్గాల మీదుగా జరగనుం ది. పర్యటనలో కత్తిపూడి, ఉప్పాడ బస్టాండ్ సెంటర్, సర్పవరం మొత్తం మూడు బహిరంగ సభల్లో పవన్‌కళ్యాణ్ ప్రసంగించనున్నారు.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రాకతో జిల్లా జనసేన శ్రేణుల్లో తొణకిసలాడుతున్న ఉత్సాహం
తొలిరోజు సభ ద్వారా జిల్లాలో పార్టీ సత్తా చాటాలని భావిస్తున్న నేతలు
ఈనెల 19న మధ్యాహ్నం జిల్లా పర్యటన ముగింపు
తర్వాత కోనసీమలోకి ప్రవేశించనున్న వారాహి యాత్ర
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 9 గంటలకు అన్నవరం సత్యదేవుడి దర్శనంతో జిల్లా లో యాత్ర మొదలుకానుంది. ప్రజాసమస్యలపై పోరాటం,అధికార వైసీపీ అవినీతి, అక్రమాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా సాగనున్న యాత్ర జిల్లాలో నాలుగు నియోజకవర్గాల మీదుగా జరగనుం ది. పర్యటనలో కత్తిపూడి, ఉప్పాడ బస్టాండ్ సెంటర్, సర్పవరం మొత్తం మూడు బహిరంగ సభల్లో పవన్‌కళ్యాణ్ ప్రసంగించనున్నారు. జిల్లాలో పర్యటన సాగినన్ని రోజులూ ప్రతిరోజూ ఉదయం ఆయా నియోజకవర్గా ల పరిధిలో ప్రజలనుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారు. కీలక సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయడంలో భాగంగా ఏదొక ప్రాంతా న్ని పరిశీలించనున్నారు. ఎన్నికలు ముంచుకువస్తున్న వేళ తమకు బాగా పట్టున్న తూర్పు నుంచి పవన్ వారాహి యాత్రకు శ్రీకారం చుట్టడంతో జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణకిసలాడుతోంది. మరోపక్క పవన్ వారాహి యాత్రకు జిల్లా పోలీసుశాఖ కొన్ని షరతులతో కూడిన అనుమ తులు జారీ చేసింది. అటు జిల్లా పర్యటనలో పవన్ పర్యటించనున్న ప్రాంతాలను జిల్లా ఎస్పీ మంగళవారం పరిశీలించారు.
యాత్రతో ఊపొచ్చినట్టే..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వారాహి యాత్రను కాకినాడ జిల్లానుంచి ప్రారంభిస్తుండ డంతో సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. జనసేన పార్టీకి కాకినాడ జిల్లా రాజకీయంగా మంచి పట్టున్న ప్రాంతంగా మొదటినుంచీ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతు న్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడినుంచే పవన్ ఎన్నికల శంఖారావం పూరిస్తుండడంతో యాత్ర భారీగా విజయవంతం అవుతుందని పార్టీనేతలు ధీమా కనబరుస్తున్నారు. పైగా అన్నవరం సత్యదేవుడి దర్శనంతో వారాహి యాత్రను మొదలుపెడుతుండడం పార్టీ నేతలు సెంటిమెంట్‌గా భావిస్తు న్నారు. మరోపక్క పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పార్టీ నేత లు అన్నవరానికి చేరుకున్నారు. యాత్ర తొలిరోజు కావడంతో జిల్లాతో పా టు చుట్టుపక్క ఇతర జిల్లాలనుంచి కూడా నేతలు, పార్టీ శ్రేణులు, అభి మానులు తరలివస్తున్నారు. పవన్ యాత్ర ద్వారా జిల్లాలో తమ బలం ఏస్థాయిలో ఉందో చూపించాలని నేతలు పట్టుదలగా ఉన్నారు. అందుకో సం అన్నవరంనుంచి బహిరంగ సభ జరిగే కత్తిపూడివరకు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. ఒకరకంగా చెప్పాలంటే తొలిరోజు ఆరం భం రాష్ట్రం మొత్తం తమ బలాన్ని చాటేలా ఉండాలని నేతలు భావిసు ్తన్నారు. కాగా విజయవాడలో మంగళవారం పూజలు ముగించుకుని పవన్‌కళ్యాణ్ రాత్రి కి రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా ్ధరాత్రి అన్నవరం కొండపై బస ప్రాంతానికి వెళ్లారు. వారాహి వాహనం సైతం అన్నవరానికి చేరుకుంది. దీనికి బుధవారం ఉదయం సత్యదేవుడి ఆలయంవద్ద పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇదే వాహనంపై కత్తిపూడి సభలో పవన్ ప్రసంగించనున్నారు. కాగా తన పర్యటన మొ త్తం పవన్ అన్నివర్గాలకు చేరువయ్యేలా వ్యూహం రూపొందించుకున్నార ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అన్ని సామాజికవర్గాల ప్రజలు, నేతలు, నిపుణులతో చర్చలు జరిపి వారి మనోభిప్రాయాలు పవన్ తెలుసుకోను న్నారు. జిల్లాలో అనేక వృత్తులకు సంబంధించి సమస్యలున్నాయి. ప్రతి రోజూ ఉదయం ఆయా వర్గాలనుంచి విజ్ఞాపనలు స్వీకరించి వారి సమ స్యలను పవన్ ఆలకిస్తారు. అవి పరిష్కారం అయ్యేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేయనున్నారు. జిల్లాలో వారాహి యాత్ర విజయ వంతం అయ్యేందుకు పార్టీ ఏడు ప్రత్యేక కమిటీలు కూడా నియమించిం ది. కాగా వారాహి యాత్రలో పవన్ ప్రసంగం ఏస్థాయిలో ఉండబోతుంద నేది పార్టీ శ్రేణులు భారీ అంచనాలు వేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ధ్వజంతోపాటు జిల్లాలో ఆ పార్టీ నేతల భాగోతాలను పవన్ ప్రస్తావించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
పవన్‌కల్యాణ్ పర్యటనకు బందోబస్తు
పిఠాపురం సభ ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ
పిఠాపురం, జూన్ 13: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటన సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. వారాహియాత్రలో భాగంగా పిఠాపురం పట్టణం ఉప్పాడ సెంటర్‌లో పవన్ నిర్వహించనున్న సభ ప్రాం తాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. 14వ తేదీన కత్తిపూడి, 16న పిఠాపురం, 18న సర్పవరంల్లో పవన్ సభలు ఉంటాయని, మిగిలిన రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ఉంటాయని సమాచారమిచ్చారని ఎస్పీ వివరించారు. సభలకు వచ్చే ప్రజలను ఆ రోజు ఉదయం అంచనా వేసి అం దుకు తగ్గట్టుగా బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు. పవన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బం దులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. ఆయా ప్రాంతాల పోలీసు అధికారులతో జనసేన నాయకులు టచ్‌లో ఉన్నారని తెలిపారు. వారాహి యాత్ర ప్రశాంతంగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, కాకినాడ డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఉన్నారు. అంతకు ముందు వారాహియాత్ర రూట్‌ను ఎస్పీ పరిశీలించారు.
పవన్ రాత్రి బసపై సందిగ్ధత
గొల్లప్రోలు, జూన్ 13: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటనలో రాత్రిబసపై సందిగ్ధత నెలకొంది. ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం 14వతేదీ సాయంత్రం కత్తిపూడిలో బహిరంగసభ తర్వాత రాత్రి గొల్లప్రోలు చేరుకుని సత్యకృష్ణ ఫంక్షన్‌హాలులో బస చేయాల్సి ఉంది. బుధవారం రాత్రి హాలును ఫంక్షన్‌కోసం వేరేవాళ్లు ముందుగానే బుక్ చేసుకోవడంతో రాత్రి బస విషయంపై సస్పెన్స్ నెలకొంది. జనసేన నాయకులు ఫంక్షన్ హాలును 15, 16వతేదీలకు బుక్ చేసుకున్నారు. దీంతో పవన్‌కల్యాణ్ బుధవారంరాత్రి కత్తిపూడిలో లేదా అన్న వరంలో రాత్రి బస చేస్తారా, లేకుంటే గొల్లప్రోలులోనే ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తారా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది.