Mudragada Padmanabham: పదే పదే తొక్క తీస్తా.. నారా తీస్తా అన్నారు.. ఎంతమందికి తీయించారో చెప్పండి?.. పవన్‌కు ముద్రగడ లేఖ
ABN, First Publish Date - 2023-06-20T10:24:51+05:30
నసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని తరచూ అంటున్నారని.. అటువంటప్పుడు జనసేన పార్టీకి మద్దత్తు ఇవ్వాలని.. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలన్నారు.
కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు (Janasean Chief Pawan Kalyan) కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) లేఖ రాశారు. బీజేపీ (BJP), టీడీపీ (TDP), జనసేన (Janasena) కలిసి పోటీ చేస్తామని తరచూ అంటున్నారని.. అటువంటప్పుడు జనసేన పార్టీకి మద్దత్తు ఇవ్వాలని.. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలన్నారు. కలసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్వాస్పదమన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి (Kakinada MLA Dwarampudi Chandrashekar Reddy) దొంగ అయినప్పుడు రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించాలని అన్నారు. దుర్మార్గపు శాసనసభ్యులను అసెంబ్లీకి పంపించకుండా ఉండడం కోసం రేపు జరగబోయే ఎన్నికలలో వారి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించాలని డిమాండ్ చేశారు. సత్తా చూపడానికి ముందుకు రావాలన్నారు. వారిని శాశ్వతంగా రాజకీయాలనుండి తొలిగేలా చేయాలని తెలిపారు. కాపు ఉద్యమాలకు సహాయం చేసిన వారిని విమర్శించడం తగదన్నారు. ‘‘మీ ప్రసంగాలలో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు. ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి, క్రింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలి’’ అంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2023-06-20T10:24:51+05:30 IST