Chandrababu Tour: చంద్రబాబు అనపర్తి సభకు నిన్న అనుమతి.. నేడు రద్దు
ABN, First Publish Date - 2023-02-17T12:03:40+05:30
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
కాకినాడ: తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు అనపర్తి సభ (Chandrababu Anaparthi Sabha)కు పోలీసులు (Police) అనుమతి నిరాకరించారు. ఈ మేరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు చంద్రబాబు అనపర్తి పర్యటనకు కలెక్టర్ (Collector), ఎస్పీ (SP) నిన్ననే అనుమతి ఇచ్చారు. అయితే సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఈరోజు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై టీడీపీ నేతలు (TDP Leaders) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే... చంద్రబాబు (TDP Chief) పర్యటనలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత పర్యటనను అడ్డుకునేందుకు ఎక్కడా లేని ఆంక్షలు విధిస్తున్నారు. గత రెండు రోజులుగా జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దఎత్తున ప్రజలు చంద్రబాబు పర్యటనలో పాల్గొంటున్నారు. చంద్రబాబుకు ఎక్కడిక్కడ హారతులు పడుతున్నారు. తమ సమస్యలను టీడీపీ అధినేతకు చెప్పుకొంటున్నారు. రెండు రోజులుగా విజయవంతంగా పర్యటిస్తున్న చంద్రబాబు ఈరోజు సామర్లకోట నుంచి బయలుదేరి అనపర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో రాజమహేంద్రవరం పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.
నిన్న ఒకే.. ఈరోజు నో అంటున్న పోలీసులు
అనపర్తిలో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతులు లేవని తెలిపారు. చంద్రబాబు (TDP) సభ నిర్వహించే ప్రాంతం అత్యంత రద్దీ ప్రాంతామని , ఐదువేలకు మించి ప్రజలు పట్టే అవకాశం లేదంటూ సభకు అనుమతులు నిరాకరిస్తూ నోటీసులు జారీ(Issuance of notices) చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం (AP Government) ఆదేశాల మేరకే పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో రాజమహేంద్రవరం, జగ్గంపేట, పెద్దాపురంలో భారీ స్థాయిలో జనం తరలివచ్చి చంద్రబాబు సభకు నీరాజనం పలికారు. అందులో భాగంగా ఈరోజు జరిగే అనపర్తి బహిరంగ సభకు అనుమతి కోసం నిన్ననే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి (Former MLA Ramakrishna Reddy)స్వయంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు. దీంతో చంద్రబాబు సభకు కలెక్టర్, ఎస్పీ అనుమతులు జారీ చేశారు. ఈక్రమంలో బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలో నిన్న తాము ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు కాసేపటి క్రితమే పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై టీడీపీ పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేశారు.
టీడీపీ, చంద్రబాబు పర్యటనను లక్ష్యంగా చేసుకుని సీఎం, వైసీపీ ఎక్కడికక్కడ ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్రకు ఎన్ని ఆటంకాలు కలిగిస్తున్నారో.. ఆదే రీతిలో చంద్రబాబు పర్యటనకు కూడా ఆటంకాలు కలిగించేలా కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం నేతలు భగ్గుమంటున్నారు. రెండు రోజులుగా చంద్రబాబుకు వస్తున్న అపూర్వ స్పందనను చూపి ఈరోజు కావాలనే అనుమతులు రద్దు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
Updated Date - 2023-02-17T12:44:29+05:30 IST