Rajahmundryలో వైసీపీ భారీ రోడ్డు షో.. జనసేన, టీడీపీ ధ్వజం
ABN, First Publish Date - 2023-01-09T11:45:52+05:30
జీవో నెం.1ను లెక్కచేయని అధికార పార్టీ నేతలు. ఆ జీవో తమ కోసం కాదన్నట్టుగా వైసీపీ లీడర్లు ఎక్కడపడితే అక్కడ భారీగా రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. తాజాగా కొంతమూరు బ్రిడ్జి
రాజమండ్రి: జీవో నెం.1ను లెక్కచేయని అధికార పార్టీ నేతలు. ఆ జీవో తమ కోసం కాదన్నట్టుగా వైసీపీ లీడర్లు ఎక్కడపడితే అక్కడ భారీగా రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. తాజాగా కొంతమూరు బ్రిడ్జి నుంచి కోరుకొండ మండలం గాడాల వరకు వైసీపీ నేతలు (YCP leaders) పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ రోడ్డు షోలో ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy), ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (Jakkampudi Raja) పాల్గొన్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు విమానాశ్రాయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
రోడ్డు షోపై జనసేన, టీడీపీ ధ్వజం
వైసీపీ రోడ్డు షోను జనసేన (Janasena) జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ (Kandula Durgesh), టీడీపీ (tdp) రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీలో ఎమర్జెన్సీని మంచిన భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. ‘‘పోలీసులు వైసీపీకి ఊడిగం చేస్తున్నారు. వైసీపీ వాళ్లు విచ్చలవిడిగా రోడ్ షోలు చేస్తున్నారు. ఏపీలో గవర్నర్ పాలన విధించాలి. జనసేన పార్టీ ప్రజాప్రయోజనాల కోసం టీడీపీతో కలిసి పనిచేస్తుంది. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. వైసీపీకి ప్రైవేట్ సైన్యం ఉందని చెప్పటం దుర్మార్గం. అధికారంలో ఉన్న వైసీపీకి ప్రైవేట్ సైన్యం ఎందుకు? ప్రైవేట్ సైన్యం పేరుతో విపక్షాలను భూస్థాపితం చేసే విధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. వైసీపీని, జగన్ ప్రైవేట్ సైన్యాన్ని జనం ఇంటికి పంపుతారు.’’ అని కందుల దుర్గేష్ హెచ్చరించారు.
Updated Date - 2023-01-09T11:45:53+05:30 IST