ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: లోకేశ్‌ను కలిసిన పోతవరం రైతులు, గ్రామస్తులు

ABN, First Publish Date - 2023-09-01T12:27:35+05:30

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నల్లజర్ల మండలం పోతవరం వద్దకు చేరుకుంది.

తూర్పుగోదావరి: టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) నల్లజర్ల మండలం పోతవరం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు, రైతులు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తాడిపూడి కాలువ నుంచి తమ వ్యవసాయ భూములకు నీరు రావడం ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా వరి నారు ఎండిపోయిందని.. కొన్ని భూముల్లో నీరు లేక వరినాట్లు వేయలేదని తెలిపారు. తాడిపూడి కాల్వ నుంచి నీరు ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. సీతామావు డ్యామ్ ఆరు సంవత్సరాల క్రితం వరదల్లో కొట్టుకుపోయిందని ఇప్పటికీ మరమ్మతులు లేవని తెలియజేశారు. పోతవరం నుంచి యర్నగూడెం రోడ్డు అధ్వానంగా ఉందన్నారు. పోతవరం -నల్లజర్ల రహదారి వెళ్లే రహదారి పూర్తిగా పాడైపోయిందని గ్రామస్తులు తెలియజేశారు.


నారా లోకేష్ స్పందిస్తూ... జగన్ రెడ్డి అడ్డగోలు దోపిడీ వలన రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. ప్రాజెక్టులకు కనీసం సక్రమంగా నిర్వహించలేని పరిస్థితిలో దివాలాకోరు ప్రభుత్వం ఉందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక తాడిపూడి కాల్వ నుంచి పోతవరం పొలాలకు నీరందించే అవకాశాన్ని పరిశీలిస్తామని.. సీతామావు డ్యామ్ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని లోకేశ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-01T12:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising