చంద్రబాబును విడుదల చేయాలి
ABN , First Publish Date - 2023-09-12T23:31:20+05:30 IST
ప్రత్తిపాడు, సెప్టెంబరు 12: టీడీపీ అధినేత నారా చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ప్రత్తిపాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ కళామందిర్ సెంటర్‌లో మంగళవారం ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభ రాజా నాయకత్వంలో ధర్నా నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అం దజేశారు. సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్రంలో అరా చక, నియంతక పాలన కొనసాగుతుందని, సీఎం జగన్‌కు చట్టాలపై

ప్రత్తిపాడు ఇన్‌చార్జి సత్యప్రభ పూజలు
ప్రత్తిపాడు, సెప్టెంబరు 12: టీడీపీ అధినేత నారా చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ప్రత్తిపాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ కళామందిర్ సెంటర్‌లో మంగళవారం ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభ రాజా నాయకత్వంలో ధర్నా నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అం దజేశారు. సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్రంలో అరా చక, నియంతక పాలన కొనసాగుతుందని, సీఎం జగన్‌కు చట్టాలపై అవగాహన, గౌరవం లేదని విమ ర్శించారు. చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బద్దంగా పాలన అందించారని, జగన్ రాజ్యాంగ విరుద్దంగా పాలన అందిస్తున్నారన్నారు. ఎందరో యువకులకు ఉపాధి కల్పించిన స్కిల్ డె వలప్‌మెంట్ వ్యవహారాన్ని జగన్, మంత్రులు తప్పు పట్టడం దారుణమన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తి వేయాలని, వెంటనే విడుదల చేయా లని డిమాండ్ చేశారు. ఆందోళనలో నాయకులు ము దునూరి మురళీకృష్ణంరాజు, కొమ్ముల కన్నబాబు, పర్వత సురేష్, పైలా సాంబశివరావు, అమరాది వెం కట్రావు, సూది బూరయ్య, బద్దిరామారావు, తమరాన సత్యనారాయణ, ఉల్లి వీరభద్రం, బొదిరెడ్డి గోపి, జ్యో తుల పెదబాబు, బొల్లుకొండబాబు, పల్లాగోపి, యా ళ్ళ జగదీష్, సర్పంచ్‌లు మంతెన శ్రీను, తటవర్తి సుబ్బారావు, మాజీ సర్పంచ్‌లు మూరా వరప్రసాద్, యాళ్ళ విశ్వేశ్వరరావు, సూర్నీడి సురేష్, ఇళ్ళ అప్పా రావు, వెలుగుల కొండల రావు, పోలిశెట్టి శ్రీను పాల్గొన్నారు. ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఉన్న పాదాలమ్మవారికి సత్యప్రభ 101 కొబ్బరికాయలు చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో విడుదల కావాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అనంతరం రాజ మహేంద్రవరంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల టీడీపీ సమావేశానికి నాయకులతో తరలివెళ్లారు.