స్వర్ణ పతక విజేత సాత్విక్‌కు సత్కారం
ABN , First Publish Date - 2023-05-21T02:12:59+05:30 IST
దుబాయ్‌లో జరిగిన ఏషియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో చిరాగ్ శెట్టితో కలసి దేశానికి స్వర్ణ పతకం సాధించిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌ను శనివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఘనంగా సత్కరించారు.

అమలాపురంటౌన్, మే 20: దుబాయ్‌లో జరిగిన ఏషియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో చిరాగ్ శెట్టితో కలసి దేశానికి స్వర్ణ పతకం సాధించిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌ను శనివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఘనంగా సత్కరించారు. భవిష్యత్‌లో దేశానికి మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో తండ్రి కాశీవిశ్వనాథ్‌తో కలిసి సాత్విక్‌ను సత్కరించారు. కోనసీమజిల్లా ఖ్యాతిని అంతర్జాతీ యంగా ఇనుమడించిన ఘనత సాత్విక్‌కు దక్కుతుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా సాత్విక్‌కు కలెక్టర్ శుక్లా ఒక ట్రోఫీని బహూ కరించారు. కార్యక్రమం లో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి డాక్టర్ పీఎస్ శర్మ, గోకరకొండ నాగేంద్ర పాల్గొన్నారు.
న్నా రు. సత్యవేణి భ