‘భవిష్యత్తు’కు బ్రహ్మరథం
ABN , First Publish Date - 2023-07-14T01:40:54+05:30 IST
రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ జోన్-2 టీడీపీ చైతన్య రథయాత్ర గురువారం డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో వైభవంగా సాగింది. ఐదు రోజులుగా జిల్లాలో సాగిన బస్సు యాత్ర రాజోలులో జరిగిన యాత్రతో ముగిసి పశ్చిమగోదావరి జిల్లాకు శుక్రవారం పయనం కానుంది.

జిల్లాలో వైభవంగా ముగిసిన బస్సు యాత్ర
మాజీ మంత్రి గొల్లపల్లి ఆధ్వర్యంలో గ్రామగ్రామాన స్వాగతాలు
చివరిరోజు మామిడికుదురు, రాజోలు, మలికిపురం మండలాల్లో ‘భవిష్యత్తు గ్యారంటీ’ యాత్రకు అపూర్వ నీరాజనం
మామిడికుదురు/మలికిపురం/రాజోలు,జూలై13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ జోన్-2 టీడీపీ చైతన్య రథయాత్ర గురువారం డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో వైభవంగా సాగింది. ఐదు రోజులుగా జిల్లాలో సాగిన బస్సు యాత్ర రాజోలులో జరిగిన యాత్రతో ముగిసి పశ్చిమగోదావరి జిల్లాకు శుక్రవారం పయనం కానుంది. గురువారం బస్సు యాత్ర పాశర్లపూడిలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లూరి వెంకట సూర్యనారాయణరాజు, జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజులు బస్సు యాత్రను ప్రారంభించారు. మండ లంలోని పాశర్లపూడి నుంచి బయలుదేరిన యాత్ర మామిడికుదురు, మాకనపాలెం, కొమరాడ, గోగన్నమఠం మీదుగా సాగింది. ఆయా గ్రామాల్లో అడుగడుగునా ప్రజలు యాత్రకు స్వాగతం పలికారు. గోగన్నమఠంలో యాత్రకు పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్, బోనం బాబు, ఈలి శ్రీనివాస్, సూదా బాబ్జి, మల్లాడి విష్ణు, గంధం భాస్కర్, ఉండ్రు శ్రీరామారావు, భూపతిరాజు సాయిబాబురాజు పాల్గొన్నారు. అనంతరం బస్సు యాత్ర వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ కాన్వాయ్‌తో రాజోలు మండలం పొన్నమండకు చేరుకుంది. యాత్రకు బాణసంచా కాల్పులతో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు మహిళలు హారతులుపట్టారు. పొన్నమండ నుంచి ములికిపల్లి సెం టర్‌కు బస్సు యాత్ర చేరుకుంది. మాజీ ఎంపీపీ అనుచూరి సునీత, మాజీ సర్పంచ్ అనుచూరి పురుషోత్తం దంపతులు మాజీ మంత్రి గొల్లపల్లికి దుశ్శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు. ములికిపల్లి నుంచి బస్సు యాత్ర మెరకపాలెం మీదుగా కాట్రేనిపాడులంకకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రూరమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుతోనే గ్యారంటీ అని అన్నారు. నారా లోకేశ్ చేస్తున్న పాద యాత్ర ధైర్య సాహసాలతో కూడిన పాదయాత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు చిటికెల రామ్మోహనరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి దంతులూరి చంటిబాబు, రాజోలు ఎంపీపీ కేతా శ్రీను, వైస్ ఎంపీపీ పొలమూరి శ్యామ్‌బాబు, గుబ్బల శ్రీనివాస్, మొల్లేటి శ్రీనివాస్, అడబాల యుగంధర్, బస్సు యాత్ర కన్వీనర్ ముప్పర్తి నాని, బోళ్ల సతీష్‌బాబు, చాగంటి స్వామి, బోళ్ల వెంకట రమణ, బందెల పద్మ, మంగెన భూదేవి, కాండ్రేగుల భవానీలావణ్య, చెల్లింగి జాంబవతి, సోమిశెట్టి ధనలక్ష్మి, కడలి శ్రీదుర్గ, మోకా ఉష, అడబాల సత్య రమేష్, మానుకొండ దుర్గాప్రసాద్, సోమిశెట్టి ప్రకాష్, అడబాల చంటి పాల్గొన్నా రు. తర్వాత బస్సు యాత్ర మలికిపురం మండలం గొల్లపాలెంలోకి మధ్యా హ్నం ప్రవేశించింది. గొల్లపాలెంలో మహి ళలు పెద్దసంఖ్యలో గొల్లపల్లికి హారతులు పట్టారు. గొల్లపాలెం నుంచి ప్రారంభమైన యాత్ర తూర్పుపాలెం చేరడానికి గంటన్నర పట్టింది. దారికి ఇరువైపులా అధిక సంఖ్యలో ప్రజలు బస్సు యాత్రకు స్వాగతం పలికారు. బస్సు యాత్రలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వందలాదిగా మోటారుసైకిళ్లు, ట్రాక్టర్లు, కార్లతో యాత్రను అనుసరించారు. బస్సు యాత్ర తూర్పుపాలెం చేరేసరికి సాయంత్రం 4 గంటలు దాటింది. టీడీపీ నాయకులు అడబాల సాయిబాబు ఇంటి వద్ద యాత్రలో పాల్గొన్నవారికి భోజన వసతి ఏర్పాటుచేశారు. అనంతరం యాత్ర కేశనపల్లి, చింతలమోరి గ్రామాల నుంచి సఖినేటిపల్లి మండలం కేశవదాసు పాలెం చేరింది. నాయకులు ముదునూరి చినబాబురాజు, మట్టపర్తి లక్ష్మి, కడలి దుర్గాదేవి, అడబాల రమాదేవి, చెల్లింగి జాంబవతి, కోట పుష్పకుమారి, మొల్లేటి శ్రీనివాస్, యెనుముల నాగు, గుబ్బల శ్రీనివాస్, వర్థినేని బాబ్జి, రాపాక నవరత్నం, గెడ్డం సింహా, తాడి సత్యనారాయ ణ, బోళ్ల వెంకట రమణ, పితాని సూరిబాబు, వలవల శేఖర్‌లు పాల్గొన్నారు.