YuvaGalam Padaytra: లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
ABN, First Publish Date - 2023-11-27T11:11:32+05:30
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత మొదలుపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు బెయిల్‌పై బయటకు వచ్చారు.
రాజోలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర దాదాపు రెండున్నర నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత మొదలుపెట్టారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కారణంగా సెప్టెంబర్ 9న యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ లభించడంతో లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. దీంతో ఈరోజు (సోమవారం) అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210 రోజు యాత్రను యువనేత పున:ప్రారంభించారు. లోకేష్ పాదయాత్రలో టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు యువనేత పాదయాత్ర చేశారు.
పాదయాత్ర వివరాలు ఇవే..
ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం
11:20 గంటలకు తాటిపాక సెంటర్‌లోని బహిరంగసభలో లోకేష్ ప్రసంగం
12:35 గంటలకు పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం నగరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి
మధ్యాహ్నం 2 గంటలకు మామిడికుదురులో స్థానికులతో సమావేశం
2:45 గంటలకు పాశర్లపూడిలో భోజన విరామం
సాయంత్రం 4 గంటలకు పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు
4:30 గంటలకు అప్పనపల్లి సెంటర్‌లో స్థానికులతో సమావేశం
5:30 గంటలకు అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ
6:30 గంటలకు బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి
7:30 గంటలకు పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటి
7:45 గంటలకు పేరూరు శివారు విడిది కేంద్రంలో బస
Updated Date - 2023-11-27T12:37:19+05:30 IST