Nara lokesh: మహిళలు దాచుకున్న రూ.2500 కోట్లు దోచుకున్న గజదొంగ జగన్..
ABN, First Publish Date - 2023-11-29T13:28:35+05:30
YuvaGalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు(బుధవారం) ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి 212వ రోజు పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్‌ను డ్వాక్రా మహిళలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
కాకినాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padaytra) కొనసాగుతోంది. ఈరోజు (బుధవారం) ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి 212వ రోజు పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్‌ను డ్వాక్రా మహిళలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
లోకేష్ స్పందిస్తూ.. జగన్మోహన్ రెడ్డికి (CM Jaganmohan Reddy) మోసం చేయడం, దోచుకోవడం తప్ప ఏమీ తెలియదని విమర్శించారు. మహిళలు దాచుకున్న రూ.2500 కోట్లు దోచుకున్న గజదొంగ జగన్ అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా మహిళలకు అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్థిక తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. పాడైపోయిన రోడ్లను బాగుచేయించి రాకపోకలకు ఇబ్బందిలేకుండా చేస్తామని తెలిపారు. రాష్ట్ర యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మహిళలు, యువత రక్షణకు కల్పించే చర్యలను విస్తృతంగా చేపడతామని లోకేష్ వెల్లడించారు.
Updated Date - 2023-11-29T13:32:35+05:30 IST