Undavalli: వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదు..
ABN, First Publish Date - 2023-07-30T13:00:49+05:30
రాజమండ్రి: రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసి నేటికి పదేళ్ళు పూర్తయిందని, ఏపీ విభజన జరిగి పదేళ్లు గడిచినా విభజన హామీలు ఇప్పటి వరకు అమలుకావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ విమర్శించారు.
రాజమండ్రి: రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ (CWC) తీర్మానం చేసి నేటికి పదేళ్ళు పూర్తయిందని, ఏపీ విభజన (AP Division) జరిగి పదేళ్లు గడిచినా విభజన హామీలు ఇప్పటి వరకు అమలుకావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ (Ex MP Undavalli Arun Kumar) విమర్శించారు. ఆదివారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ (TDP), వైసీపీ (YCP)లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో బీజేపీ (BJP)కి సహకరిస్తున్నారన్నారు. అవిశ్వాస తీర్మానంలో ఏపీ గట్టిగా మాట్లాడాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ఎంపీలు అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై అవిశ్వాసంలో ఎంపీలు మాట్లాడాలన్నారు. వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావటం లేదని, అవిశ్వాసంలో మాట్లాడమని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు, జగన్‌లు బీజేపీకు సరెండర్ అయ్యారని, ఎన్నికల ముందైనా ఏపీకి జరిగిన అన్యాయంపై అవిశ్వాసంలో మాట్లాడాలని ఉండవల్లి అరుణకుమార్ సూచించారు. 2021, 2022లో ఏపీకి కేంద్రం ఇచ్చిన ఎన్‌ఎచ్‌బీసీ, పంపు స్టోరేజ్ కంపెనీలు అదానీకి కట్టబెట్టారని ఆరోపించారు. స్టోరేజ్ కంపెనీలు అదానికి కట్టబెట్టడం కరెక్ట్ కాదన్నారు. రాజమండ్రి కంబాల చెరువు స్టోరేజ్ కెపాసిటీ తగ్గిస్తే లోతట్టు ప్రాంతాలను ముంచివేయటమేనని, మునిగిపోకుండా కాపాడాలన్నారు. రాజమండ్రిలో అనవసర పనులు చేపడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
మణిపూర్ సంఘటనపై 267, 176 రూల్స్ ప్రకారం పార్లమెంట్‌లో చర్చ జరగనివ్వాలని ఉండవల్లి అరుణకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ సరెండర్ కావటం మంచిదికాదన్నారు. గుజరాత్‌లో ముస్లింల ఊచకోత వల్లే మోదీ ప్రధాని అయ్యారన్నారు. మిలటరీ ఎందుకు స్పందించటం లేదు.. మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థపై కోర్టుకి వెళితే ఆ వ్యవస్థ రద్దవుతుందని, టీడీపీ, జనసేన పార్టీలు కోర్టుకి ఎందుకు వెళ్ళటం లేదని ఉండవల్లి అరుణకుమార్ నిలదీశారు.
Updated Date - 2023-07-30T13:00:49+05:30 IST