ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

East Godavari: చంద్రబాబు వద్దకు యనమల బ్రదర్స్ పంచాయతీ..

ABN, First Publish Date - 2023-02-08T14:39:20+05:30

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) వద్దకు యనమల బ్రదర్స్ (Yanamala Brothers) పంచాయతీ చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) వద్దకు యనమల బ్రదర్స్ (Yanamala Brothers) పంచాయతీ చేరింది. తూర్పుగోదావరి జిల్లా (East Godavari Dist.), తుని (Tuni) ఇన్చార్జ్‌గా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnadu) కుమార్తె దివ్య (Divya) నియామకంపై యనమల సోదరుడు కృష్ణుడు

(Krishnudu) అసంతృప్తికి గురయ్యారు. తనకు చెప్పకుండా ఈ విధంగా చేయడంతో తనకు అన్యాయం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణుడుపై వైసీపీ (YCP) గాలం వేసింది. పార్టీలో కీలక పదవి ఇస్తామని ఆశ చూపింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు (TDP Leaders) అప్రమత్తమయ్యారు. నిన్న ఉదయం నుంచి యనమల రామకృష్ణుడు నివాసంలో దీనిపై చర్చలు జరిగాయి. ఈ విషయం చంద్రబాబుకు తెలియడంతో కృష్ణుడిని తనవద్దకు తీసుకురావాలని యనమలకు సూచించారు. దీంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, వరుపుల రాజా.. యనమల కృష్ణుడిని తీసుకుని చంద్రబాబు నివాసానికి వచ్చారు.

ఇది కూడా చదవండి...

జగన్ పాలనపై ఓ వ్యక్తి వినూత్న నిరసన

కాగా తుని నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిని ఇటీవల మార్చిన టీడీపీ ఇప్పుడు అక్కడ మరింత బలం పెంచుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అభ్యర్థికంటే పార్టీ ముఖ్యమని, ఈ దఫా ఎలాగైనా గెలిచి తీరేందుకు అవసరమైన వ్యూహాలు అమలుచేయడానికి సన్నాహాలు చేస్తోంది. అందులోభాగంగా పార్టీలో గ్రూపు విభేదాలు లేకుండా కొత్త, పాత నాయకత్వం అంతా కలిసి పనిచేసేలా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల కొత్తగా ఎంపికైన యనమల రామ కృష్ణుడు తనయురాలు దివ్య పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. త్వరలో నియోజకవ ర్గంలో పర్యటించి అందరి సహకారంతో పార్టీ బలోపేతంపై దృష్టిసారిస్తానని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఇన్చార్జిగా కొనసాగిన యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు దివ్య నియామకంపై కాసింత ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి పార్టీ కోసం పనిచేసిన తాను గతంలో రెండుసార్లు వేర్వేరు కారణాల వల్ల ఓటమిపాలయ్యానని, ఈసారి గెలిచే అవ కాశం ఉన్న తరుణంలో తనను తప్పించడంపై గుర్రుగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన సోదరుడు యనమలకు కూడా వివరించారు.

అలాగే శనివారం కృష్ణుడు నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తనకు జరిగిన అన్యాయాన్ని వారి ముందు ఏకరువు పెట్టారు. ఈనెల 15న జిల్లాకు రానున్న అధినేత చంద్రబాబును కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తుని పార్టీలో చోటుచేసుకున్న తాత్కాలిక సంక్షోభంపై పార్టీ అధిష్ఠానం దృష్టిసారించింది. మున్ముందు కొత్త, పాత నాయకత్వం మధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, తద్వారా పార్టీకి చేటు జరిగే ప్రమాదం ఉందని గుర్తించి పరిష్కరించేందుకు రంగంలోకి దిగింది. అందులోభాగంగా కృష్ణుడికి పార్టీ నుంచి భరోసా కల్పించాలని నిర్ణయించింది. అందు కోసం ఆయన్ను అమరావతికి తీసుకురావాలని జిల్లా నేతలను ఆదేశించింది. దీంతో మంగళవారం ఉదయం కృష్ణుడుని మాజీ ఎమ్మెల్యే వర్మ, ప్రత్తిపాడు ఇన్చార్జి వరుపుల రాజా తదితరులు వెంటబెట్టుకుని అమరావతి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం యనమల రామకృష్ణుడితో సహా వీరంతా చంద్రబాబు వద్ద కూర్చుని తుని నియోజకవర్గం గురించి చర్చించనున్నారు.

నియోజకవర్గ ఇంఛార్జిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? పార్టీ నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలను కృష్ణుడికి అధినేత చంద్రబాబు వివరిస్తారని పార్టీ వర్గాలు వివరించాయి. అభ్యర్థి కంటే పార్టీ విజయం కీలకమని, ఈ నేపథ్యంలో మరోసారి తునిలో పార్టీ ఓటమి లేకుండా చూసేందుకే మార్పులు చేర్పులు చేపట్టామనే విషయాన్ని భేటీలో అధినేత ప్రస్తావించనున్నారని తెలిపాయి. మరోపక్క ఇంఛార్జి మార్పుతో యనమల సోదరుల మధ్య విభే దాలు తలెత్తాయని నియోజకవర్గ కేడర్‌లో నెలకొన్న అపోహలకు చెక్‌ పెట్టి అంతా ఓకే తాటిపై కలిసి పనిచేసేలా భేటీలో చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇన్చార్జి పదవి తొలగించినా భవిష్యత్తులో పూర్తి న్యాయం చేస్తామనే విషయాన్ని వివరించి పార్టీ విజయానికి కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనే విషయాన్ని వివరించనున్నారు. మరోపక్క ఇన్చార్జి మార్పు నేప థ్యంలో యనమల సోదరుల మధ్య కొంత దూరం పెరిగిందనే విషయం నియోజకవర్గంలో నాయకులు, కేడర్‌లో కొంత చర్చ జరుగుతోంది. ఇది పూర్తిగా తొలగిపోవాలని యనమల రామ కృష్ణుడు భావిస్తున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయం కావడంతో తాను ఎదురెళ్లలేక సమ్మతించాల్సి వచ్చిందని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధినేతతో బుధవారం జరగనున్న సమావేశం ద్వారా అన్నీ సర్దుకుని, పొరపొచ్చాలు తొలగిపోతాయని అటు యనమల, ఇటు పార్టీ నేతలు భావిస్తున్నారు.

Updated Date - 2023-02-08T14:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising