ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Global Investors Summit 2023: గ్లోబల్‌ సమ్మిట్‌లో 137 స్టాళ్లతో ఎగ్జిబిషన్‌

ABN, First Publish Date - 2023-03-03T21:41:48+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (Global Investors Summit 2023)లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (Global Investors Summit 2023)లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన (ఎగ్జిబిషన్‌)ను శుక్రవారం మధ్యాహ్నం సీఎం జగన్ (CM Jagan), కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీలు ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, మహిళా సంఘాలు, హస్త కళాకారులు ఉత్పత్తిచేసిన, తయారుచేసిన వస్తువులు, కళాకృతులు తదితరాలతో మొత్తం 137 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సీఎం, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీలు పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ ప్రదర్శనలో ఏపీ పెవెలియన్‌ (AP Pavilion) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో శ్రీసిటీలోని వివిధ పరిశ్రమలు తయారుచేసిన ఎలక్ర్టానిక్‌ పరికరాలు, వాహనాలు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించారు. రాష్ట్రంలోని కళలు, హస్త కళలు, పర్యాటక ప్రదేశాల విశేషాలతో రాష్ట్ర భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ కూడా ఆకట్టుకుంది. ఇంకా ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ తదితర సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, విడదల రజని, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-03T21:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!