ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kanna Laxminarayana: బహిరంగ సభల్లో ఉచ్ఛనీచాలు మరిచి మాట్లాడటం జగన్‌కే చెల్లింది

ABN, First Publish Date - 2023-07-22T14:19:27+05:30

ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడటం జగన్ ‌కే చెల్లిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడటం జగన్ (CM Jagan) ‌కే చెల్లిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxminarayana) వ్యాఖ్యలు చేశారు. శనివరాం మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం తండ్రి పేరుని, తల్లి, చెల్లిని వాడుకొని వదిలేసిన జగన్ రెడ్డి... సిగ్గులేకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈనాడు జగన్ పక్కన ఉన్నవారే గతంలో జగన్ లాంటి వాడు నీ కొడుకుగా పుట్టాల్సిన వాడు కాదని రాజశేఖర్ రెడ్డితో అనలేదా అని ప్రశ్నించారు. తన చీకటి బాగోతాలు ప్రజలకు తెలియవన్నట్టు గురివిందగింజలా ఇతరుల్ని వేలెత్తి చూపుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరులో వై.ఎస్ ఎక్కడున్నాడు జగన్ అని ప్రశ్నించారు. యువజన, శ్రామిక రైతుపార్టీ పాలనలో ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పాలన్నారు. మహిళలకు కన్నీళ్లు, రైతులకు కష్టాలు, యువతకు వేదన, ఉద్యోగుల రోదన తప్ప నాలుగేళ్లలో ఏం సాధించావు జగన్ అంటూ నిలదీశారు. గతంలో ఎంత మంది కలిసినా తన వెంట్రుక పీకలేరన్న జగన్, ఇప్పుడు ఓటమి భయంతో దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై విషంకక్కడం తప్ప, ప్రజలకు ఇది చేశానని చెప్పుకోలేని దుస్థితే జగన్‌తో బూతులు మాట్లాడిస్తోందన్నారు. ఎన్నికల కోసం జగన్ ఎంత ఆత్రుత పడుతున్నాడో, సైకో ముఖ్యమంత్రిని సాగనపండానికి ప్రజలు అంతకంటే ఎక్కువగా వేచి చూస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-07-22T14:19:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising