Perninani: చంద్రబాబు జైలుకు వెళ్లగానే బాలయ్య ఏం చేశారో చెప్పిన పేర్నినాని...
ABN, First Publish Date - 2023-09-22T13:29:31+05:30
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. మాజీమంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. సిమెన్స్‌తో ఒప్పందం జరిగితే డిజైన్ టెక్‌కు ఎందుకు పంపిందని ప్రశ్నించారు. అక్కడి నుండి డొల్ల కంపెనీలకు ఆ డబ్బు వెళ్లిపోయిందన్నారు.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో (AP Assembly) స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. మాజీమంత్రి పేర్నినాని (Former Minister Perninani) మాట్లాడుతూ.. సిమెన్స్‌తో ఒప్పందం జరిగితే డిజైన్ టెక్‌కు ఎందుకు పంపిందని ప్రశ్నించారు. అక్కడి నుండి డొల్ల కంపెనీలకు ఆ డబ్బు వెళ్లిపోయిందన్నారు. ఆ డబ్బును యోగేష్ గుప్తా అనే మనీ డీలర్ హవాలా ద్వారా చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్, కిలారి రాజేష్‌లకు అందించారని చెప్పారు. చంద్రబాబు అరెస్టు అయిన వెంటనే పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawankalyan) ఆదరాబాదరాగా వచ్చారన్నారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి సంతకాలు పెట్టరు అని అంటున్న పవన్‌కు చెపుతున్నా.. చంద్రబాబు (TDP Chief Chandrababu) 13 చోట్ల సంతకాలు పెట్టారని తెలిపారు. బావ జైలుకు వెళ్లగానే పార్టీ ఆఫీసుకు వెళ్లి బాలయ్య (MLA Balakrishna) చంద్రబాబు కుర్చీలో కుర్చున్నారన్నారు. సీమన్స్ కంపెనీ తమకు ఈ ఒప్పందంతో సంబంధం లేదని చెప్పారన్నారు. ఈడీ, జీఎస్టీ ద్వారా పాత్రదారులు జైలుకు వెళ్లారని... ఇప్పుడు సూత్రధారి వెళ్లారన్నారు. అవినీతి సొమ్ము చంద్రబాబు పీఏ, కిలారి రాజేష్‌ల ద్వారా అందాయన్నారు. ఈ ఇన్విస్టిగేషన్‌ను కొనసాగించాలని... ఒత్తిడులకు లొంగకుండా ముందుకు వెళ్లాలని పేర్నినాని కోరారు.
Updated Date - 2023-09-22T13:29:31+05:30 IST