TDP Former Minister: సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-10-16T19:43:17+05:30
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan) టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan) టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.
" సీఎం జగన్ విశాఖ ఎందుకు వచ్చారో ఎవరికీ తెలియదు. జగన్ గాలిలోనే వచ్చి ప్రారంభోత్సవాలు చేసి గాలిలోనే వెళ్లారు. జగన్ సర్కార్ ముచ్చట కేవలం మూడు నెలలే. జగన్ దిగిపోవడం ఖాయం. చంద్రబాబు సీఎం కావడం తధ్యం. విశాఖకు జగన్ రావడంపై కుప్పిగంతులు వేస్తున్నారు. దసరాకి కాకుండా...క్రిస్మస్‌కి విశాఖకు జగన్ వస్తున్నారట. ఉత్తరాంధ్రపై జగన్‌కి కక్ష ఉంది.. విజయమ్మను, సిటీలో వైసీపీ ఎమ్మెల్యేలను ఓడించారని కక్ష పెట్టుకున్నారు. సీఎం పదవి నుంచి దిగిలోపు జగన్ విశాఖకు రారు. ఎన్నికలు వరకు ఈ డ్రామా నడుపుతారు. గత సీఎంలు విశాఖ వచ్చినప్పుడు. రాజకీయ పార్టీలనేతలను కలిసేవారు. ప్రతి పక్ష నేతలు అంటే.. జగన్‌కి ఒళ్ళు మంట.. ప్రజా సమస్యలు వినే ఇంగిత జ్ఞానం లేదు. పరదాల మాటున పర్యటనలు చేసి వెళ్లిపోతున్నారు. సీఎం అపాయింట్‌మెంట్ కోసం కలెక్టర్‌ను అడిగితే ఇవ్వకుండా మమ్మల్ని హౌజ్ అరెస్టు చేశారు. వైసీపీ సీనియర్ నేతలు బొత్స, ధర్మాన తీరు చూస్తే జాలి వేస్తుంది. ఉత్తరాంధ్రలో టీడీపీ హయాంలో జరిగిన భివృద్ధిని..తన అభివృద్ధిగా చెప్పుకుంటున్నారు. జగన్ హయాంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒకొక్క సామంత రాజులను పెట్టుకున్నారు. ప్రతిపక్ష నేతలను వేధించారు. శుక్రవారం వస్తే చాలు నిర్మాణాలు కూల్చివేసేవారు. భీమిలి చుట్టూ పక్కల ప్రాంతాల్లో 2 లక్షల గజాలను ఒక సామంత రాజు రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకే ఆయనను ఇక్కడ నుంచి పంపేశారు. ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు దోచుకుంటున్నారు." అని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-16T19:44:31+05:30 IST