AP NEWS: స్నానానికి వెళ్లి గోదావరి నదిలో నలుగురు యువకుల గల్లంతు
ABN, First Publish Date - 2023-10-21T19:35:30+05:30
తాళ్ళరేవు మండలం గోపిలంక వద్ద గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు.
కాకినాడ: తాళ్ళరేవు మండలం గోపిలంక వద్ద గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఓ ప్రైవేట్ రిసార్టులో బస చేసి స్నానానికి నదిలో దిగగా నది ప్రవాహానికి నలుగురు గల్లంతు అయ్యారని స్థానికులు తెలిపారు. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వారిగా గుర్తించారు. చీకటి కావడంతో గాలింపు చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సంఘటన ప్రాంతానికి కోరంగి పోలీసులు చేరుకున్నారు.
గల్లంతైన యువకుల వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ కార్తీక్ (21)
మద్దిని ఫణీంద్ర గణేష్ (21)
పెండ్యాల బాలాజీ (21)
తిరుమల రావు రవితేజ (21)
Updated Date - 2023-10-21T19:38:19+05:30 IST