ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: బాపట్ల సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్

ABN, First Publish Date - 2023-03-07T10:40:20+05:30

జిల్లాలోని వేమూరు - 2 సచివాలయ ఉద్యోగిని తోట సరళ ఆత్మహత్యలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బాపట్ల: జిల్లాలోని వేమూరు - 2 సచివాలయ ఉద్యోగి (Secretariat employee)ని తోట సరళ ఆత్మహత్యలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు సరళ రాసిన సూసైడ్ లేఖ (suicide letter) తాజాగా బయటపడింది. పనిఒత్తడి తాళలేక సరళ ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో రాసింది. దీంతో తల్లి లేకపోవడం, అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుందని భావించిన కుటుంబసభ్యులు ఈ లేఖతో కన్నీరుమున్నీరు అవుతున్నారు.

కొల్లూరుకు చెందిన తోట సరళ వేమూరు - 2 సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ (Engineering Assistant)గా విధులు నిర్వహించారు. ఈ క్రమంలోనే గత నెల 24న సరళ బలవన్మరణానికి పాల్పడింది. అయితే సరళ ఆత్మహత్యకు అనారోగ్య కారణాలే కారణమని కుటుంబసభ్యులు, బంధువులు భావించారు. అయితే ఇప్పుడు సరళ రాసిన సుసైడ్ లేఖ బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సచివాలయంలో పని ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ఈ లేఖ బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. సరళతో పనిచేసిన తోటి ఉద్యోగులు సూసైడ్‌ లేఖను తీసుకుని స్థానికంగా ఉన్న ఎంపీడీవో, మండల స్థాయి అధికారులకు అందజేశారు. సరళ కుటుంబానికి అండగా ఉండాలని వినతి పత్రం అందజేశారు. అయితే పని ఒత్తిడికి గల కారణాలపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ముందుగా ఆత్మహత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు... తాజాగా సూసైడ్ నోట్ బయటపడటంతో ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎవరిని బాధ్యులను చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-03-07T10:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising