AP High Court: ఎస్ఐ నియామకాలపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసిన ఏపీ హైకోర్టు
ABN, First Publish Date - 2023-12-05T22:02:48+05:30
ఎస్ఐ నియామకాలపై ఏపీ హైకోర్టు ( AP High Court ) మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసింది. ఎస్ఐ నియామక ఫలితాలు విడుదల చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. నియామకాల్లో ఎత్తు, కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని పిటిషన్‌లో పేర్కొంది.
అమరావతి: ఎస్ఐ నియామకాలపై ఏపీ హైకోర్టు ( AP High Court ) మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసింది. ఎస్ఐ నియామక ఫలితాలు విడుదల చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. నియామకాల్లో ఎత్తు, కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని పిటిషన్‌లో పేర్కొంది. ఎత్తు అంశంలో అభ్యంతరం తెలిపిన అభ్యర్థులకు... న్యాయమూర్తి సమక్షంలో రిక్రూట్‌మెంట్ బోర్డు ఎత్తుకొలతల పరీక్షలు నిర్వహించింది. జడ్జి సమక్షంలో కొలతలు సరిపోలినట్లు గుర్తించారు. ఎస్ఐ అభ్యర్థుల అభ్యర్థనను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది, సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో పిటిషనర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-12-05T22:02:53+05:30 IST