ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: ఏపీలో వైసీపీ పని అయిపోయింది

ABN, First Publish Date - 2023-11-08T16:47:38+05:30

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కి మూడు చోట్ల ఓట్లు ఏర్పాటు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్, కలెక్టర్‌లకు లేఖలు రాసినా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ పార్టీ పని అయిపోయిందని.. 5 కోట్ల ప్రజలు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) వ్యాఖ్యానించారు. ఓటర్ లిస్ట్ అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బోండా ఉమ, తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం జగన్ (Cm jagan), వైసీపీ పార్టీ నేతలు చివరకు ఓటర్ లిస్ట్‌లపై పడ్డారు. దొంగ ఓట్లు చేర్చడానికి వలంటీర్, సెక్రటేరియట్ వ్యవస్థను తయారు చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్ లిస్ట్‌లను మాయం చేస్తున్నారు. బోండా ఉమ నియోజకవర్గంలో చెట్టును కూడా ఓటర్ లిస్ట్‌లో చేర్చారు. ఒక్కొక్క చోట మూడు ఓట్లు నమోదు చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కి మూడు చోట్ల ఓట్లు ఏర్పాటు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్, కలెక్టర్‌లకు లేఖలు రాసినా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ కమిషన్ అప్లికేషన్‌లు తీసుకున్నారు. తాజాగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌లో ఈ మూడు అంశాలను పట్టించుకోలేదు’’ అని ఆరోపించారు.

‘‘ఫామ్ 6, 7లు 7 లక్షల 80 వేలు ఇస్తే ఒక్క అప్లికేషన్ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కలెక్టర్లకు చెప్పి ఈ లోపాలు సరిచేస్తాం అన్నారు. భార్యాభర్తల ఓట్లు వేర్వేరు బూత్‌ల్లో ఉన్నారని చెబితే.. పిల్లల్ని కూడా వేరే బూత్‌లోకి పంపారు. వెబ్‌సైట్‌లో ప్రతి ఓటర్, బూత్ పేర్లుండాలి. సాప్ట్‌వేర్‌లో లోపాలు కారణంగా ఉండడం లేదని అంటున్నారు. అవకతవకలకు సంబంధించి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆధారాలతో కూడిన లేఖలు ఎన్నికల కమిషన్‌కు అందించాం. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరాం.’’ అని అచ్చెన్నాయుడు తెలిపారు.

Updated Date - 2023-11-08T16:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising