ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashok babu: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఉద్యోగులు బుద్ధి చెబుతారు

ABN, First Publish Date - 2023-10-11T15:00:34+05:30

చిలకపలుకులతో జగన్ రెడ్డిని (Cm jagan) వెనకేసుకొచ్చేవాళ్లు 11వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని మాత్రం ముఖ్యమంత్రిని అడగలేరు. జీతాలు, పింఛన్లకు నెలకు రూ.5,500 కోట్ల వరకు చెల్లించాల్సి

అమరావతి: ప్రతి అంశంపై రాజకీయ విమర్శలు చేసే మంత్రులు ఉద్యోగుల జీతాలపై ఎందుకు నోరు విప్పరు? అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు (tdp mlc Ashok babu) నిలదీశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చిలకపలుకులతో జగన్ రెడ్డిని (Cm jagan) వెనకేసుకొచ్చేవాళ్లు 11వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని మాత్రం ముఖ్యమంత్రిని అడగలేరు. జీతాలు, పింఛన్లకు నెలకు రూ.5,500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటే.. జగన్ సర్కార్ నేటికి కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఎంతమందికి జీతాలు.. పింఛన్లు ఇచ్చారంటే ఆర్థిక శాఖ నీళ్లు నములుతోంది. అగ్నిపర్వతంలోని లావాలా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా దహిస్తారు. ఉద్యోగులు.. ఉపాధ్యాయులు తమతో లేరని సకలశాఖల మంత్రి అన్నప్పుడే వారిపై జగన్ వైఖరి ఏమిటో అర్థమైంది. 13 లక్షల పైచిలుకు ఉద్యోగుల్లో కేవలం లక్షన్నర మందే నీలిరక్తం నింపుకున్నారనే నిజాన్ని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు దూరం పెట్టినంత మాత్రాన జగన్ అనుకున్నవి జరగవు.’’ అని అశోక్‌బాబు అన్నారు.

Updated Date - 2023-10-11T15:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising