ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆ ధైర్యంతోనే సీఎం జగన్ అరాచకాలు..

ABN, First Publish Date - 2023-06-27T16:00:44+05:30

అమరావతి: మాలల్లో వచ్చిన చైతన్యంతో రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని నమ్ముతున్నానని, ఇందిర, వైఎస్, జగన్ వెంటే మాలలు ఉన్నారనే ప్రచారానికి మీరే చెక్ పెట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాలల్లో వచ్చిన చైతన్యంతో రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని నమ్ముతున్నానని, ఇందిర (Indira), వైఎస్ (YS), జగన్ (Jagan) వెంటే మాలలు ఉన్నారనే ప్రచారానికి మీరే చెక్ పెట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) పిలుపిచ్చారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యాలయం (TDP Office)లో జరిగిన మాలల ఆత్మీయ సమావేశంలో (SC Spiritual Meeting) అచ్చెన్న మాట్లాడుతూ కొన్ని వర్గాల ఓట్లు తనకే పడతాయన్నది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ధైర్యమని, ఆ ధైర్యంతోనే అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. దళితులకు అన్యాయం జరుగుతుంటే కొంతమంది దళిత నేతలే మాట్లాడకపోవటం బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం అండతోనే ఎస్సీలు.. శిరోముండనాలు, హత్యలు, చిత్రహింసలకు గురవుతున్నారని, దళిత మంత్రులు జగన్మోహన్ రెడ్డి (CM Jagan)ని నిలదీస్తేనే ఎస్సీలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

మరోసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మితే అంతా కలిసి గోదాట్లో దూకటమేనని అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు మాల పల్లెల్లో కుర్చీలు వేసేవారు కాదని.. ఇప్పుడు కుర్చీలు వేసి కూర వండి, భోజనం పెట్టి మరీ బాధలు చెప్తున్నారన్నారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసి జగన్ తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు. అంబేద్కర్‌కు భారత రత్న ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోనేనని, రాష్ట్రంలో కుల వివక్షను రూపుమాపటానికి చర్యలు తీసుకుంది చంద్రబాబేనని (Chandrababu) స్పష్టం చేశారు. దళితులకు జనాభా ప్రాతిపదికన అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించిన నాయకుడు చంద్రబాబని, సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-27T16:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising