పేదల రక్తం తాగుతున్న ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-04-07T00:31:50+05:30 IST
వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో దశలవారీగా మద్యనిషేధాన్ని అమలుచేస్తామని చెప్పిన జగన్ నేడు దశలవారీగా మద్యం ధరలను విపరీతంగా పెంచి పేదల రక్తం తాగుతున్నాడని టీడీపీ పల్నాడుజిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమ ర్శించారు.

అటకెక్కిన మద్యనిషేధం అమలు హామీ
సీఎం హోదాలో జగన్ మద్యం దందా..
మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ చేయాలి
టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు
నరసరావుపేట టౌన్, ఏప్రిల్ 6 : వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో దశలవారీగా మద్యనిషేధాన్ని అమలుచేస్తామని చెప్పిన జగన్ నేడు దశలవారీగా మద్యం ధరలను విపరీతంగా పెంచి పేదల రక్తం తాగుతున్నాడని టీడీపీ పల్నాడుజిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమ ర్శించారు. గురువారం టీడీపీ పల్నాడు జిల్లా కార్యాలయంలో విలేక రుల సమాశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌రెడ్డి అధికారంలో మద్యం పేరుతో రూ.41 వేలకోట్ల దోపిడి జరిగిందన్నారు. మద్యపాన నిషేదం అని చెప్పి మహిళలకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న జగన్ అధికారం చేపట్టాక సీఎం హోదాలో మద్యం దందా నిర్వహిస్తున్నాడని, శ్రామికులు, పేదలే లక్ష్యంగా మద్యం ధరలను విపరీతంగా పెంచి దోచుకుంటున్నాడని ఆరోపించారు. బెల్ట్ షాపులు వైసీపీ కార్య కర్తలకు ఆదాయవనరులుగా మారాయన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌రెడ్డి బినామీలే లిక్కరును తయారు చేస్తూ పిచ్చి బ్రాండ్లతో నాసిరకం మద్యాన్ని అమ్ముతున్నారని, దీంతో ప్రజల ఆరో గ్యం దారుణంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని మద్యం, గంజాయి మత్తులో ముంచుతున్నారని, దీంతో అత్యాచా రాలు, అరాచకాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. మూడున్న రేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అత్యాచార కేసులు 3,372, మహిళలు, ప్రజలపై దాడుల కేసులు 52,587 నమోదయ్యా యన్నారు. మద్యనిషేధం అమలును విస్మరించిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మహిళలలే సమాధి కడతారని హెచ్చరించారు. తక్షణ మే మద్యం రేట్లు తగ్గించాలని, రాష్ట్రంలోని 3 లక్షల బెల్ట్ షాపులను రద్దు చేయాలని, కల్తీ, నాసిరకం మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పి, రూ.50 లక్షలు నష్ట పరి హారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులును ఆదుకోవడంలో పూర్తిగా విఫలం
అకాల వర్షాలకు పంట కోల్పోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని జీవీ ఆంజనేయలు ఆరోపిచారు. అరకొరగా జరిగిన పంటనష్టం రైతుల పేర్ల నమోదులోనూ కేవలం వైసీపీ శ్రేణు లకు చెందినవారి పేర్లనే నమోదు చేసుకున్నారని, రైతులకు పరిహారం విషయంలో పార్టీలు చూడటం సరైందికాదన్నారు. ఇప్పటి కైనా నిజ అర్హులను గుర్తించి వారికి పంటనష్టం పరిమారం అందేలా చూడాలని డిమాండ్‌చేశారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి ఎం.ధారునాయక్, తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్‌బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, టీడీపీ మైనారిటి సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ మాబు సుభాని, హనుమయ్య, జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.