ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viveka case: వివేకా కేసులో అజయ్ కల్లాంరెడ్డి పిటిషన్‌కు CBI స్ట్రాంగ్ కౌంటర్

ABN, First Publish Date - 2023-09-16T17:37:20+05:30

వివేకా హత్య కేసు(Viveka case)లో తన వాంగ్మూలాన్ని మార్చారని.. అజయ్ కల్లాంరెడ్డి(Ajay Kallam Reddy) పిటిషన్‌కు సీబీఐ(CBI) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అజయ్ కల్లాం స్టేట్‌మెంట్ ఆడియో టేప్ ఉందని..సంచలన విషయాన్ని సీబీఐ(CBI) బయటపెట్టింది.

ఢిల్లీ: వివేకా హత్య కేసు(Viveka case)లో తన వాంగ్మూలాన్ని మార్చారని.. అజయ్ కల్లాంరెడ్డి(Ajay Kallam Reddy) పిటిషన్‌కు సీబీఐ(CBI) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అజయ్ కల్లాం స్టేట్‌మెంట్ ఆడియో టేప్ ఉందని..సంచలన విషయాన్ని సీబీఐ(CBI) బయటపెట్టింది. CRPCలోని 161 కింద అజయ్ కల్లాం ఇచ్చిన స్టేట్‌మెంట్,..ఆడియో టేప్‌లు ఉన్నాయని సీబీఐ(CBI) పేర్కొంది. ఆడియో టేప్‌లను కోర్టుకి సీల్డ్ కవర్‌లో ఇస్తున్నట్టు సీబీఐ(CBI)‌లో అఫిడవిట్‌లో తెలిపింది. స్టేట్‌మెంట్ రికార్డ్ సమయంలో ఆయనకు వినిపించి.. ఓకే అన్న తర్వాత సంతకం తీసుకున్నామని సీబీఐ(CBI)‌ చెప్పింది. ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,.. ప్రస్తుతం సీఎం సలహాదారుడుగా ఉన్న వ్యక్తి అనడంపై CBI అభ్యంతరం వ్యక్తం చేసింది.ప్రాసిక్యూషన్ సాక్షులపై ప్రభావం పడుతోందని సీబీఐ(CBI)‌ ఆందోళన వ్యక్తం చేసింది.అజయ్ కల్లాంరెడ్డిని కేసు విచారణ దశలో.. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో అడుగుతామని సీబీఐ(CBI)‌ పేర్కొంది.

ఆ తర్వాత ఆయన న్యాయపరమైన చర్యలకు..ఎదుర్కొనాల్సి ఉంటుందని సీబీఐ(CBI)‌ హెచ్చరించింది.16 పేజీల అఫిడవిట్‌ను తెలంగాణ హైకోర్టులో దర్యాప్తు అధికారి దాఖలు చేశారు.తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని వక్రీకరించారని అజయ్ కల్లాం ఈకేసులో పిటిషన్ వేశారు..కల్లాం విచారణకు ముందే హాస్టైల్ అయినట్టుగా..భావిస్తున్నామని సీబీఐ(CBI)‌ పేర్కొంది.అజయ్ కల్లాం పిటిషన్‌లో ఆయన పేర్కొన్న అంశాలు.. మిస్‌లీడ్ చేసే విధంగా ఉన్నాయని సీబీఐ(CBI)‌ ఆరోపించింది.161 స్టేట్‌మెంట్ నమోదు చేసేటప్పుడు.. న్యాయశాస్త్రం ప్రకారం రికార్డ్ చేస్తామని కోర్టుకు దర్యాప్తు అధికారి తెలిపారు.తాము స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత..మార్పులు, చేర్పులను అజయ్ కల్లాంరెడ్డి డిక్టేట్ చేశారని సీబీఐ(CBI) పేర్కొంది.అజయ్ కల్లాం తన పిటిషన్ ద్వారా వివేకా హత్య కేసు దర్యాప్తును,.. CBI ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని దర్యాప్తు అధికారి ఆరోపించారు. వాస్తవాలను కోర్టు ముందు ఉంచుతున్నామని ... అజయ్ కల్లాం రెడ్డి పిటిషన్‌ను కొట్టివేయాలని సీబీఐ(CBI)‌కోరింది.

Updated Date - 2023-09-16T17:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising