Volunteers Delhi High court: వలంటీర్ల కేసులో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు
ABN, First Publish Date - 2023-08-14T14:36:46+05:30
ఢిల్లీ హైకోర్టులో ఏపీ వలంటీర్ల కేసు విచారణ జరిగింది. వలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం నెలకు రూ.200 ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉషోదయ పబ్లికేషన్స్ సవాలు చేసింది.
ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఏపీ వలంటీర్ల కేసు విచారణ జరిగింది. వలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం నెలకు రూ.200 ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉషోదయ పబ్లికేషన్స్ సవాలు చేసింది. 200 రూపాయలతో సాక్షి పత్రిక మాత్రమే కొంటున్నారని ఆరోపించింది. ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీంతో ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అనంతరం కేసును ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దీంతో సోమవారం వలంటీర్లపై కేసును ఢిల్లీ హైకోర్టు విచారించింది. వలంటీర్లకు రెండు వందలు ఇచ్చే విధానంపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది.
Updated Date - 2023-08-14T14:36:46+05:30 IST