AP NEWS: సీఎం జగన్‌ను కలిసిన ఈఎన్సీ చీఫ్ రాజేష్ పెంధార్కర్
ABN, First Publish Date - 2023-08-29T20:03:36+05:30
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN)ని తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్(Rajesh Pendharkar) కలిశారు.
అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN)ని తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్(Rajesh Pendharkar) కలిశారు. ఇటీవల ఈఎన్సీ చీఫ్‌గా రాజేష్ పెంధార్కర్ బాధ్యతలు స్వీకరించారు. సీఎం జగన్ రాజేష్ పెంధార్కర్‌ను సన్మానించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు. తూర్పు సముద్ర తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను సీఎంకు వివరించారు. తూర్పు నౌకాదళ కమాండ్ (ఈఎన్సీ) ఆధ్వర్యంలోవచ్చే ఫిబ్రవరిలో బహుపాక్షిక నావికా విన్యాసమైన మిలన్ 2024కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు రాజేష్ పెంధార్కర్ తెలిపారు.57 దేశాల్లోని ప్రముఖుల, నౌకాదళాల భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. మిలన్ 2024 విశేషాలను, వైస్ అడ్మిరల్, అడ్మినిస్ట్రేషన్ అంశాలపై కూడా సీఎంతో చర్చించారు. సీఎం జగన్‌కు ఐఎన్‌ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్‌ను రాజేష్ పెంధార్కర్ బహుకరించారు.సీఎంని కలిసిన వారిలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎన్సీరావు (సివిల్ మిలటరీ లైజన్ (అడ్వైజరీ), కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిషోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-08-29T20:03:36+05:30 IST