Gone Prakash Rao: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై గోనె ప్రకాశ్‌రావు ఏమన్నారంటే..?
ABN, First Publish Date - 2023-09-12T18:05:27+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan Reddy) 16 నెలలు జైల్లో ఉన్నాడని.. తన మాదిరిగానే చంద్రబాబు(Chandrababu), టీడీపీ నేతలు అందరినీ జైళ్లో ఉంచాలనే కుటిల పన్నాగాలు పన్నుతున్నాడని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు(Gone Prakash Rao) వ్యాఖ్యానించారు.
ఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan Reddy) 16 నెలలు జైల్లో ఉన్నాడని.. తన మాదిరిగానే చంద్రబాబు(Chandrababu), టీడీపీ నేతలు అందరినీ జైళ్లో ఉంచాలనే కుటిల పన్నాగాలు పన్నుతున్నాడని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు(Gone Prakash Rao) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రసుత్తం ఏపీ రాజకీయాల్లో పలు సంఘటనలు జరగుతున్నాయి. జగన్ జైల్లో 16 నెలలు ఉన్నాడు, జగన్ జైలుకు వెళ్లడానికి కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అని ఆయన మనసులో ఉంది. దానిలో భాగంగానే తనను జైలుకు పంపిన వారందరినీ జైల్లో వేయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడును జైలుకు పంపారు. సజ్జల రామకృష్ణరెడ్డి ఒక బ్రోకర్, ఒక చీటర్, అహంకారి.ముఖ్యమంత్రి, మంత్రులు అన్ని సజ్జలే ఆయనకు సిగ్గు శరం లేదు.జగన్ జైలుకు ఎందుకు పోయాడో సజ్జల చెప్పాలి.దమ్ముంటే సజ్జల చర్చకు రావాలి. చర్చకు సిద్ధమా ఇడుపులపాయకు రమ్మన్న వస్తానని గోనె ప్రకాశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-12T18:05:27+05:30 IST