ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: రెండో రోజు అదే సీన్.. అరుపులతో దద్దరిల్లిన గుంటూరు కౌన్సిల్ సమావేశం

ABN, First Publish Date - 2023-06-24T12:07:09+05:30

నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రెండో రోజు అదే సీన్ రిపీట్ అయ్యింది. అరుపులు, కేకలతో కౌన్సిట్ సమావేశం దద్దరిల్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రెండో రోజు అదే సీన్ రిపీట్ అయ్యింది. అరుపులు, కేకలతో కౌన్సిట్ సమావేశం దద్దరిల్లింది. శనివారం సమావేశం ప్రారంభమైన వెంటనే ఎన్టీఆర్ సర్కిల్‌ను అభివృద్ధి చేయాలంటూ టీడీపీ (TDP) కార్పోరేటర్లు పట్టుబట్టారు. నగరంలోని అనేక సర్కిల్స్‌ను అభివృద్ధి చేసి ఎన్టీఆర్ సర్కిల్‌ను ఎందుకు వదిలేశారేంటూ టీడీపీ కార్పోరేటర్లు ప్రశ్నించారు. అయితే కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని వైసీపీ (YCP) కార్పోరేటర్లు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్‌ను తానే అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ముస్తఫా స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ముస్తఫాతో టీడీపీ కార్పోరేటర్లు వాగ్వివాదానికి దిగారు. దీంతో టీడీపీ కార్పోరేటర్లు కౌన్సిల్ హాల్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్టీఆర్‌ సర్కిల్ అభివృద్ధి కోసం తొమ్మిది లక్షల నిధులు విడుదల చేసినప్పటికీ కాంట్రాక్టర్ పని చేయలేదన్న వైసీపీ కార్పోరేటర్లు చెప్పొకచ్చారు.

నిన్నటి మీటింగ్‌లోనూ గందరగోళం

కాగా.. మొదటి రోజు జరిగిన నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల వాగ్వాదంతో నగరపాలక సంస్థ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశంలో ఐ పాక్ టీమ్ రావడం కలకలం రేపింది. కౌన్సిల్ సమావేశానికి ఐ పాక్ సభ్యులు రావడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఇక ఉదయం సభలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య నీటి సరఫరా విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది.

Updated Date - 2023-06-24T12:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising