AP High Court: ఎస్సై నియామకాల రిట్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2023-12-04T20:34:32+05:30
రేపు (మంగళవారం) ఏపీ హైకోర్టులో ఎస్సై నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నది. ఎస్సై నియామకంలో అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతంలోఎత్తు అంశంలో అర్హత కలిగిన అభ్యర్థులను తాజా రిక్రూట్మెంట్‌లో రిక్రూట్ మెంట్ అధికారులు అనర్హులుగా పరిగణించారు.
అమరావతి: రేపు (మంగళవారం) ఏపీ హైకోర్టులో ఎస్సై నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నది. ఎస్సై నియామకంలో అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతంలోఎత్తు అంశంలో అర్హత కలిగిన అభ్యర్థులను తాజా రిక్రూట్మెంట్‌లో రిక్రూట్ మెంట్ అధికారులు అనర్హులుగా పరిగణించారు. రేపు హైకోర్టులో న్యాయమూర్తి సమక్షంలో ప్రభుత్వ డాక్టర్‌తో అభ్యర్థులకు తిరిగి ఎత్తు కొలిచే ప్రక్రియ చేపట్టనున్నది. అయితే ఎత్తు అంశంలో అభ్యర్థులు రిక్రూట్మెంట్ బోర్డ్‌పై చేసిన ఆరోపణలు తప్పని రుజువైతే ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయలు పెనాల్టీ విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది. రేపు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు హైకోర్టుకు హాజరు కావాలని అభ్యర్థులు, రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులను ఆదేశించింది. ఎస్సై నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని హైకోర్టులో న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
Updated Date - 2023-12-04T20:34:48+05:30 IST