Amaravati: టీడీపీ నేతల హౌస్ అరెస్టులు..
ABN, First Publish Date - 2023-08-30T07:52:26+05:30
అమరావతి: ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది.
అమరావతి: ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ ఇసుక, అక్రమ మైనింగ్‌పై టీడీపీ పోరాటం చేస్తోంది.
మరోవైపు గుంటూరు జిల్లాలో మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజాలను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా బుధవారం టీడీపీ నేతలు మైనింగ్ శాఖ డీడీను కలవనున్నారు. అయితే దీనికి అనుమతి లేదంటూ పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్‌లు చేసి నోటీసులు జారీ చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన మైనింగ్ ఆఫీస్‌కు వెళ్లి ఇసుక అక్రమాలపై ఆధారాలు ఇస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.
Updated Date - 2023-08-30T07:52:26+05:30 IST